టాలీవుడ్

ప్రభాస్ తో కాదు..అఖిల్ తో ..చర్చలు జరుగుతున్నాయి

Very-Interesting-Coincidence-of-Prabhas-and-Akhil-Akkineniతమిళ దర్శకులకు ఇప్పుడు తెలుగులో మంచి ఆదరణ దొరుకుతోంది. ఇక్కడ హీరోలు వారిని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే వారిని అడ్డం పెట్టుకుని తమిళ మార్కెట్లో దూసుకుపోవచ్చని, అక్కడ మార్కెట్ ని గ్రాబ్ చేయవచ్చని. అందులో భాగంగా..రీసెంట్ గా మహేష్ బాబు…మురదగాస్ తో స్పైడర్ చేస్తే..త్వరలో అల్లు అర్జున్…మరో తమిళ దర్శకుడు లింగుసామితో సినిమా చేస్తున్నారు. ఆల్రెడీ సందీప్ కిషన్ అయితే వరసపెట్టి తమిళ,తెలుగు సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మరో తమిళ దర్శకుడు తెలుగులోకి దిగుతున్నాడు. అతనే అట్లీ.

ఈ మధ్య కాలంలో తమిళంలో బాగా పాపులర్ అయిన డైరెక్టర్ అట్లీ. మరో తమిళ దర్శకుడు ఎ.ఆర్.మురుగుదాస్ నిర్మించిన ‘రాజా రాణి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన అట్లీ.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా ఇక్కడ తెలుగు లో కూడా రిలీజై బాగా ఆడింది. ఆ తరవాత విజయ్ హీరోగా ‘థెరి’ తెరకెక్కించాడు. ఇది కూడా కమర్షియల్ మంచి హిట్ అయ్యింది. ఈ సినిమా ‘పోలీసోడు’ పేరుతో తెలుగులో డబ్బింగ్ చేసి దిల్ రాజు రిలీజ్ చేసారు.

రీసెంట్ గా అట్లీ దర్శకత్వం వహించిన ‘మెర్సల్’ మూవీ బాక్సాఫీసు వద్ద ప్రకంపనలు సృష్టించింది. ఈ సినిమా ‘అదిరింది’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో రిజల్ట్ ఎలా ఉన్నా… ‘మెర్సల్’ సినిమా వివాదాల్లోకి ఎక్కడంతో తమిళనాడుతో పాటు దక్షిణ భారతం వ్యాప్తంగా అట్లీ పేరు బాగా పాపులర్ అయిపోయింది.

దీంతో ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ తెలుగు చిత్ర పరిశ్రమపై కన్నేశాడు. మాస్ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించగల సత్తా అట్లీకి ఉందని పేరు తెచ్చుకోవటంతో ఇక్కడ హీరోలు సైతం ఆయన దర్శకత్వంలో చేయటానికి ఆసక్తి చూపుతున్నారు. ఎమోషన్స్‌ను తెరపై పండించడంలో ఆయనది ప్రత్యేక శైలి.

ఆయన ప్రభాస్ తో సినిమా చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రభాస్ కాదు అఖిల్ తో సినిమా అని తెలుస్తోంది. ఈ మేరకు ఓ పెద్ద నిర్మాత..అఖిల్ ని అట్లీని కలిపి సినిమా ప్లాన్ చేస్తున్నారు.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

ఒక్క క్షణం DEC 28
అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll