టాలీవుడ్

‘వివేకం’టాక్ తేడానా? అదే దెబ్బకొట్టిందా

vivegamహీరో అజిత్‌ తాజాగా చిత్రం ‘వివేగం’ తెలుగులోకి ‘వివేకం’ పేరుతో అనువాదమయ్యి… ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అజిత్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అయితే ఆ స్దాయిలో సినిమా ఉందా… సినిమా తమిళంలో ఎలాగో భారీ ఓపినింగ్స్ తో, ఫస్ట్ వీక్ ఎలా ఉన్నా లాగేస్తుంది. తెలుగులో కేవలం సినిమా టాక్ పైనే హిట్ స్దాయి ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే చాలా చోట్ల ఈ చిత్రం షోలు పడ్డాయి. ఈ నేపధ్యంలో చిత్రం టాక్ ఏంటి అనేది చూద్దాం.

ఇప్పటికే సినిమా చూసిన వారి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం… డైరెక్టర్ శివ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో విజువల్ ఫీస్ట్ లా చిత్రీకరించారు. అయితే సినిమాలో అందుకు తగ్గ కంటెట్ లేదని తెలుస్తోంది. మిలిటరీ ఆపరేషన్, టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రం ఇది.

కథ, అందులో మలుపులు ప్రత్యేకంగా లేకుండా రొటీన్ గానే ఉన్నా…ఈ చిత్రంలో రిచ్ గా ఉండే విజువల్స్ కట్టిపారేస్తున్నాయంటున్నారు. దర్శకుడు కేవలం గ్రాండ్ గా ఉన్న విజువల్స్, అజిత్ యాక్షన్ ఎపిసోడ్స్ తోనే సినిమాని నెట్టుకురావడానికి ప్రయత్నించాడు. అంతేకానీ ఎగ్జైట్మెంట్ కు గురి చేసే బలమైన సన్నివేశాల్ని కూర్చలేదు. దాంతో తమిళనాడులో ఉన్న అజిత్ వీరాభిమానులను సినిమా ఆకట్టుకోవచ్చు ఏమో కానీ ..ఇక్కడ కష్టమే అంటున్నారు.ఎన్నో అంచనాలతో సినిమా చూసిన తెలుగు వారికి వివేకం నిరాశనే మిగులుస్తుంది.

సినిమా హైలెట్స్ లో అజిత్ అద్బుతమైన పెర్ఫామెన్స్ , స్టైలింగ్ ఒకటి. అయితే సినిమా స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడంతో సీన్స్ అంతగా పండలేదు. విజువల్స్, స్టైలిష్ టేకింగ్ లో హాలీవుడ్ స్థాయిలో ఉన్నా కథ,కథనం మాత్రం భోజపురి స్దాయి చిత్రం అని మాత్రం చెబుతున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద వివేకం ఫలితం ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.

ఈ చిత్రం రైట్స్ ని వంశీధర్ క్రియోషన్స్ వారు నాలుగున్నర కోట్లకు తీసుకుని, డిస్ట్రిబ్యూటర్స్ కు ఐదు కోట్ల నలభై ఐదు లక్షలకు అమ్మేసారు. టేబుల్ ప్రాఫిట్ గా కోటి రూపాయలు మిగిలిందని తెలుస్తోంది. ఇప్పటివరకూ తెలుగులో అజిత్ సినిమా దేనికి పలకని రేటు ఈ సినిమాకు పలికింది.

వంశధార క్రియేషన్స్‌ పతాకంపై నవీన్‌ శొంఠినేని అందిస్తున్నారు. తమిళంలో టి.జి.త్యాగరాజన్‌ సమర్పణలో సత్యజ్యోతి ఫిలిమ్స్‌ పతాకంపై సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మిస్తున్నారు

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll