కోలీవుడ్

విశ్వాసం అంటే ఇదే..అందుకే అదే టైటిల్

Ajith_Sivaఅజిత్ – శివ కలయికలో మొదటి చిత్రం 2014లో వచ్చిన ‘వీరం’. ఈ చిత్రం ‘వీరం’ విజయాన్ని సాధించడంతో.. అజిత్ మరోసారి శివ పై నమ్మకముంచి ‘వేదలమ్’ అప్పగించారు. ఆ చిత్రం కూడా వసూళ్లు కురిపించింది. ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కలయికలో ఈ సంవత్సరం వచ్చిన ‘వివేగం’ మాత్రం వర్కవుట్ కాలేదు. హాలీవుడ్‌ స్థాయిలో ఈ సినిమాను రూపొందించినప్పటికీ ఆశించిన విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. అజిత్‌ అభిమానులే శివపై కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. అలాంటి పరిస్థితుల్లోనే మళ్లీ వీరి కాంబినేషన్‌లో నాలుగో సినిమా వస్తుందని వార్తలొచ్చాయి. వద్దంటూ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికీ పోస్ట్‌లు చేస్తున్నారు. అయినప్పటికీ మళ్లీ వీరి కాంబినేషన్‌ ఖరారైంది. సత్యజ్యోతి ఫిలిమ్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

దాంతో తమపై నమ్మకం పెట్టిన దర్శకుడు, నిర్మాతపై విశ్వాసంగా తన తదుపరి చిత్రం డేట్స్ ఇచ్చారు. మూడు సార్లు విజయాల్ని ఇచ్చిన శివతోనే తన తదుపరి చిత్రాన్ని ప్రకటించేశాడు అజిత్. ఆ చిత్రానికి టైటిల్ గా ‘విశ్వాసం’ అని ఖరారు చేశారు.

ఎప్పుడూ సినిమా చిత్రీకరణ చివరిదశలో ఉన్నప్పుడే టైటిల్‌ను ప్రకటిస్తారు అజిత్‌. ఈ సినిమాకు ఆదిలోనే ‘విశ్వాసం’ అని టైటిల్‌ను చెప్పేశారు. మూడు చిత్రాల మాదిరిగా ఈ సినిమా కూడా ‘వి’ అనే అక్షరంతోనే ఆరంభమవడం విశేషం. హీరోయిన్‌, ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. జనవరిలో చిత్రీకరణ ఆరంభమవుతుంది. వచ్చే ఏడాది దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మొత్తానికి వరుసగా నాలుగుసార్లు అజిత్‌ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు దర్శకుడు శివ గ్రేటే మరి.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

Now Showing

లండన్ బాబులు 17 NOV 17
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll