శ్రీదేవి నా భార్య అని, జయప్రదని నేను పెళ్లి చేసుకున్నానని గతంలో కొందరు వాళ్ల ఇళ్లదగ్గర గొడవలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆ మద్యన ధనుష్ తన కుమారుడు అంటూ ఒక వృధ్ద జంట కోర్టుకు ఎక్కారు. ఇప్పుడు వారు ఏమయ్యారో తెలియదు. తాజాగా మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ బ్యూటీ ఐశ్యర్యరాయ్ నా తల్లి అంటూ ఓ కుర్రాడు మీడియాకు ఎక్కాడు.
వివరాల్లోకి వెళితే…కానీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ 29 ఏళ్ల యువకుడు మాత్రం తన తల్లి ఐశ్యర్యరాయేనని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. 1988లో ఐవీఎఫ్ ద్వారా తాను ఐశ్వర్యకు జన్మించినట్లు అతను చెబుతున్నాడు. ఆ యువకుడి పేరు సంగీత్‌కుమార్. అంతేకాదు తన పేరు మధ్యలో రాయ్ అని ఐశ్వర్య ఇంటి పేరు కూడా తగిలించుకున్నాడు.
లండన్‌లో 1988లో ఐవీఎఫ్ ద్వారా నేను ఐశ్వర్యకు జన్మించాను. రెండేళ్ల వరకు ఐశ్వర్య తల్లిదండ్రులు బృందా, క్రిష్ణరాజ్ రాయ్‌ల దగ్గరే పెరిగాను. మూడేళ్ల వయసులో నన్ను విశాఖపట్నం తీసుకొచ్చారు. మా తాత క్రిష్ణరాజ్ రాయ్ గతేడాది ఏప్రిల్‌లో మరణించాడు. మా అంకుల్ పేరు ఆదిత్య రాయ్ అని ఈ సంగీత్ కుమార్ అనే వ్యక్తి మంగళూరులో మీడియాతో మాట్లాడుతూ చెప్పడం గమనార్హం.
2007లో తన తల్లి ఐశ్వర్య.. అభిషేక్‌ను పెళ్లి చేసుకున్నదని, వాళ్లిద్దరూ ఇప్పుడు వేర్వేరుగా ఉంటున్నారని అతను అంటున్నాడు. 27 ఏళ్లుగా తన తల్లికి దూరంగా ఉన్నానని, ఇప్పుడైనా ఆమె మంగళూరుకు వచ్చి తనతో ఉండాలని వేడుకుంటున్నాడు. విశాఖపట్నం తిరిగి వెళ్లాలనుకోవడం లేదని కూడా అతను స్పష్టంచేశాడు.
అయితే ఐశ్వర్య తన తల్లి అని నిరూపించడానికి అతని దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. వైజాగ్‌లో ఉండగా తన బంధువులు ఆధారాలు లేకుండా చేశారని, దీంతో తాను ఐశ్వర్య దగ్గరికి వెళ్లలేకపోయానని సంగీత్ అంటున్నాడు. మరి ఐశ్వర్య రాయ్ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.