టాలీవుడ్

చూసారా? ‘అజ్ఞాతవాసి’ షూటింగ్ స్పాట్ వీడియో లీక్…

 

స్టార్ హీరోల సినిమాలపై అందరి కళ్ళూ ఉంటాయి. రిలీజ్ అయ్యాక అందుకే వెంటనే పైరసీకు గురి అవుతూంటాయి. అయితే ఈ మధ్యన ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. షూటింగ్ లొకేషన్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా…సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయటం కోసం..ఎవరో ఒకరు దొంగచాటుగా …వీడియోలు షూట్ చేసి లీక్ చేయటం ఓ ట్రెండ్ గా మారింది. తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ పైరసీకి గురి అయ్యింది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం లో అజ్ఞాతవాసి మూవీ లో పవన్ నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మొన్నటి వరకు వారణాసి లో షూటింగ్ జరుపుకున్న చిత్ర యూనిట్ , ఈరోజు హైదరాబాద్ లోని అమెజాన్ ఆఫీస్ ఎదుట జరిగింది.

ఈ సినిమాలో పవన్ ఐటి ఉద్యోగిగా కనిపించబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ఆఫీస్ ముందు చాలా మంది నిరుద్యోగులు ఇంటర్వ్యూ కోసం లైన్ లో నిలబడి ఉంటారు. అప్పుడు పవన్ అక్కడకు ఎంట్రీ ఇస్తాడు. ఐడి కార్డు చూపించి లోపలకు వెళతాడు. ఆ సీన్ తాలూకు మేకింగ్ ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది.

ఇక్కడ మరో విశేషం ఉంది.. క్యూ లో నిలబడిన వారందరు నిజానికి ఆ ఆఫీస్ లో పనిచేసే ఉద్యోగులట. సాధారణంగా జూనియర్ ఆర్టిస్టులతో ఇలాంటి సీన్లు చేస్తారు. కానీ కంపెనీ ఉద్యోగులు వారే ఇష్టంగా పవన్ సినిమాలో కనిపించడానికి వచ్చారట. మీరు కూడా ఆ వీడియో ఫై లుక్ వెయ్యండి.

ఇక ఈ చిత్రం కథ …

అజ్ఞాతవాసి టైటిల్ సినిమా కథ అంటూ ఒకటి ఫిలిం నగర్లో హల్ చల్ చేస్తోంది. త్రివిక్రమ్‌పై హాలీవుడ్‌ చిత్రాల ప్రభావం బాగా ఉంటుంది. ఈసారీ ఓ హలీవుడ్‌ సినిమా త్రివిక్రమ్‌కి బాగా నచ్చిందని, ఆ కథని స్ఫూర్తిగా తీసుకొని ‘అజ్ఞాతవాసి’ అనే స్క్రిప్టు తయారు చేశారని తెలుస్తోంది. ‘ది హెయిర్‌ అప్పారెంట్‌’ అనే ఓ ఇంగ్లిష్‌ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ‘అజ్ఞాతవాసి’ కథ రాసు కున్నాడట త్రివిక్రమ్‌. ఓ ధనవంతుడు అనుకోకుండా ఓ ప్రమాదంలో చనిపోతాడు. అతనికి ఇద్దరు భార్యలు. అతని ఆస్తంతా కాజేయాలని ఓ ముఠా కుట్ర పన్నుతుంది.

అయితే ధనవంతుడి మొదటి భార్యకి ఓ కొడుకు ఉంటాడు. తను ఎక్కడున్నాడో అంతుపట్టదు. అతని కోసం సాగించిన అన్వేషణ, అతనొచ్చాక ఎదురైన పరిణామాలే ఈ చిత్ర కథ. దానికీ ‘అజ్ఞాతవాసి’ కథకీ చాలా దగ్గర పోలికలు ఉన్నాయని తెలుస్తోంది. మరి త్రివిక్రమ్‌ ఎలాంటి మ్యాజిక్‌ చేశాడో చూడాలి. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ సంచలనాలు సృష్టించాయి. ముచ్చటగా మూడో చిత్రంతో వీరిద్దరూ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని అభిమానులు గంపెడాశలతో ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్‌ ఫామ్‌, ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌ దృష్ట్యా హ్యాట్రిక్‌ కొట్టడం ఈజీగానే కనిపిస్తోంది. జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది ప్లాన్‌.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

మళ్ళీ రావా DEC 8
MCA DEC 21
హలో DEC 22
ఒక్క క్షణం DEC 23
చలో DEC 29

Now Showing

జవాన్ DEC 1
ఆక్సిజన్ NOV 30
బాలకృష్ణుడు NOV 24
mental మదిలో NOV 24
ఖాకి NOV 17

Poll