టాలీవుడ్

‘అజ్ఞాతవాసి’: ఆ విషయంలో తొలి భారతీయ చిత్రం

agaపవన్ అభిమానులు అందరూ ‘అజ్ఞాతవాసి’ సంగీతంలో మునిగి తేలుతూ సినిమా కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వారికో హ్యాపీ న్యూస్. ‘అజ్ఞాతవాసి’ చిత్రం మరో ఘనత సాధించబోతోంది. అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లోని యూనివర్శల్‌ స్టూడియోస్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారట. అక్కడి సిటీ వాక్‌ థియేటర్స్‌లో ప్రదర్శించబోయే తొలి భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం.

ఈ విషయానికి సంబంధించిన పోస్టర్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌అవుతోంది. 2018 జనవరి 9న ఈ చిత్రాన్ని సిటీ వాక్‌ థియేటర్స్‌లో ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది.

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ హీరో గా నటించిన చిత్రం ‘అజ్ఞాతవాసి’. కీర్తి సురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్స్. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూర్చారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని పాటలు శ్రోతలను విశేషంగా అలరిస్తున్నాయి. అంతేకాదు.. డబ్‌స్మాష్‌ రూపంలో ఆన్‌లైన్‌లోనూ హల్‌చల్‌ చేస్తున్నాయి.

హారిక హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘అజ్ఞాతవాసి’ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాల తర్వాత పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు విశేష స్పందన వస్తోంది. త్వరలోనే ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నారు.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

ఒక్క క్షణం DEC 28
అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll