టాలీవుడ్

‘అజ్ఞాత‌వాసి’ : ప్లైట్స్, మొబైల్స్, మెట్రో కాబిన్స్

pawan-kalyanఫ్లైట్స్ బ్రాండింగ్‌తో సరికొత్త పబ్లిసిటీకి శ్రీకారం చుట్టింది రజనీకాంత్ ‘కబాలి’, ‘అఙ్ఞాతవాసి’కి కూడా అదే తరహాలో ప్రచారం చేయబోతున్నారట. స్పైస్ జెట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని హైదరాబాద్ నుంచి విశాఖ, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే రెండు ఫ్లైట్స్‌లో ‘అజ్ఞాతవాసి’ బ్రాండింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అలాగే ఈనెలలో ‘అమరావతి’లో జరగబోయే ‘అఙ్ఞాతవాసి’ ఆడియో రిలీజ్ ను కూడా సరికొత్తగా ప్లాన్ చేశారు. మరి ప్రచారంలో సరికొత్త ఎత్తుగడలతో వస్తున్న ‘అఙ్ఞాతవాసి’ సంక్రాంతికి ఎలాంటి సందడి చేస్తాడో చూడాలి.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఏస్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూడో చిత్రం ‘అజ్ఞాత‌వాసి’. కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో కుష్బూ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్ కు రకరకాలుగా ప్లాన్స్ చేస్తున్నారు టీమ్. సినిమా విడుదల దగ్గర పడుతుండడంతో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘అఙ్ఞాతవాసి’ టీమ్ అలెర్ట్ అయింది. ప్రచారంలో తమ సినిమాని కొత్త పుంతలు తొక్కించేందుకు సిద్ధమవుతోంది.ప్రచారంలో భాగంగా పవర్‌స్టార్ మొబైల్స్‌ని విడుదల చేస్తూ సరికొత్తగా ప్రయోగం చేయబోతున్నారు.

‘అఙ్ఞాతవాసి’ కోసం సరికొత్తగా మొబైల్ బ్రాండింగ్, ఫ్లైట్ బ్రాండింగ్, మెట్రో ట్రైన్స్ బ్రాండింగ్‌పై దృష్టిపెడుతోంది యూనిట్. పవన్ సినిమా కోసం సెల్‌కాన్ మొబైల్ సంస్థ ‘పి.ఎస్.పి.కె.25’ పేరుతో సరికొత్త మొబైల్స్‌ను తీసుకొచ్చే ఆలోచనలో ఉందట. తొలి విడతగా 50 వేల మొబైల్స్‌ను విడుదల చేసే ఆలోచనలో ఉంది. ఇటీవలే ఆరంభమైన హైదరాబాద్ మెట్రో ట్రైన్స్‌పై కూడా ఫోకస్ పెట్టిందట ‘అఙ్ఞాతవాసి’ టీమ్. 14 మెట్రో రైళ్లలో ‘అఙ్ఞాతవాసి’ని ప్రమోట్ చేయబోతున్నారట.

త్రివిక్రమ్, పవన్ కలయికలో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ సంచలనాలు సృష్టించాయి. ముచ్చటగా మూడో చిత్రంతో వీరిద్దరూ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని అభిమానులు గంపెడాశలతో ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్‌ ఫామ్‌, ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌ దృష్ట్యా హ్యాట్రిక్‌ కొట్టడం ఈజీగానే కనిపిస్తోంది. ఈ చిత్రంలో పవన్‌కి జోడీగా అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని తొలి పాట ‘బయటికొచ్చి చూస్తే’కు విశేష ఆదరణ లభించింది.

ఇదిలా ఉంటే.. వార‌ణాసి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించిన తాజా అప్ డేట్ ఏమిటంటే.. ఇంకో 4 రోజుల ప్యాచ్ వ‌ర్క్‌, 20 శాతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉన్నాయ‌ని తెలిసింది. అనిరుద్ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 10న విడుద‌ల కానుంది.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2