బాక్స్ ఆఫీస్

‘బాహుబలి’ని దాటేసిన ‘అజ్ఞాతవాసి’:టాక్ తో పనేంటి

agnathavasi-baahubaliపవన్ అభిమానులు అందరూ ‘అజ్ఞాతవాసి’ మేనియాలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వారికో హ్యాపీ న్యూస్. టాక్ తో సంభందం లేకుండా ‘అజ్ఞాతవాసి’ చిత్రం మరో ఘనత సాధించింది. మంగళవారం అమెరికాలో విడుదలైన ఈ సినిమా అక్కడి బాక్సాఫీసు వద్ద ‘బాహుబలి’, ‘ఖైదీ నంబర్‌ 150’ రికార్డులను బ్రేక్‌ చేసినట్లు విశ్లేషకులు తెలిపారు. ప్రీమియర్‌ షోల ద్వారా దాదాపు 1.40 మిలియన్ల డాలర్లు వసూలు చేసినట్లు పేర్కొన్నారు.

‘అజ్ఞాతవాసి’ విదేశీ పంపిణీ హక్కులను ఎల్‌ఏ తెలుగు సంస్థ రూ.19.50 కోట్లకు కొనుగోలు చేసిందట. డిస్ట్రిబ్యూటర్లు మంగళవారం అక్కడ ప్రీమియర్‌ షోల కోసం 600 స్క్రీన్లను బుక్‌ చేసినట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమా టికెట్‌లకు అమెరికాలో భారీ డిమాండ్‌ నెలకొంది. సినిమా కేవలం ప్రీసేల్స్‌ ద్వారా మిలియన్‌ డాలర్లు రాబట్టడం విశేషం.

‘బాహుబలి: ది బిగినింగ్‌’, ‘ఖైదీ నంబర్‌ 150’ సినిమాలు అమెరికా ప్రీమియర్‌ షోలలో వరుసగా 1,005,630 డాలర్లు, 1,295,613 డాలర్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు తెలిపారు. ఈ కలెక్షన్స్‌ను 1,464,647 డాలర్ల వసూలుతో ‘అజ్ఞాతవాసి’ బీట్‌ చేసింది.

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ‘అజ్ఞాతవాసి’ సినిమాకు దర్శకత్వం వహించారు. అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తిసురేశ్‌ హీరోయిన్స్. ఖుష్బూ, బొమన్‌ ఇరానీ, రావు రమేశ్‌, మురళీశర్మ ప్రధాన పాత్రలు పోషించారు.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16