టాలీవుడ్

లాయర్లను కించపరిచే సీన్స్ తొలిగించి,బహిరంగ క్షమాపణ చెప్పాలి

anjaniక‌న్న‌డ ప‌వర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ న‌టించిన తాజా చిత్రం అంజనీపుత్ర ఇటీవ‌ల విడుద‌లై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. అయితే ఇందులో న్యాయ‌వాదుల‌ని కించ‌ప‌రిచే కొన్ని స‌న్నివేశాలు ఉన్నాయ‌ని ఆరోపిస్తూ, ఓ లాయ‌ర్ కోర్టుని ఆశ్ర‌యించారు.

న్యాయ‌వాదుల‌కి సంబంధించిన స‌న్నివేశాల‌ని వెంట‌నే తొల‌గించి, క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని లాయ‌ర్ సిటీ సివిల్ కోర్టులో తెలిపారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన కోర్టు సినిమాను వ‌చ్చే నెల 2 వ‌ర‌కు ప్ర‌ద‌ర్శించ‌వ‌ద్దని తెలిపింది. ఈ లోగా లాయర్లను, న్యాయ వ్యవస్థను కించపరిచే డైలాగులను తొలగించాలని పేర్కొంది. అయితే షోలు మాత్రం ఆగలేదు. దాంతో ఈసారి లాయిర్లు రంగంలోకి దిగి తమ నిరసన తెలిపారు.

అంజనీపుత్ర సినిమాలో న్యాయవాదులను కించపరిచే సన్నివేశాలను తక్షణం తొలగించి దర్శకుడు, నిర్మాత బహిరంగ క్షమాపణ చెప్పాలని లాయర్లు డిమాండ్‌ చేశారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ… కోర్టు ఆదేశించినా అంజనీపుత్ర చిత్రాన్ని ప్రదర్శించడం కోర్టు ఆదేశాలను ఉల్లఘించారని, ఈ విషయం కోర్టు తీవ్రంగా పరిగణించిందన్నారు. లాయర్ల పట్ల కించపరిచే సన్నివేశాలు, డైలాగులను తక్షణం తొలగించి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. లేదంటే పోరాటం ఉధృతం చేస్తామన్నారు.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll