టాలీవుడ్

‘కొడకా కోటేశ్వరరావు ..’ సాంగ్ పై పై కేసు

 

pawan-songత్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌ నటించిన ‘అజ్ఞాతవాసి’ ప్రపంచవ్యాప్తంగా రేపు అనగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. కీర్తిసురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్ గా చేస్తోంది. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు శ్రోతలను విశేషంగా అలరిస్తున్నాయి.

అయితే లాస్ట్ మినిట్ లో ‘అజ్ఞాతవాసి’ చిత్రంపై మరో వివాదం ముసురుకుంది. ఇందులో పవన్‌కల్యాణ్‌ ‘కొడకా కోటేశ్వరరావు’ అంటూ పాట పాడిన సంగతి తెలిసిందే. ఈ పాటను సినిమా నుంచి తొలగించాలని విజయవాడ మాచవరం పోలీస్‌స్టేషన్‌లో న్యాయవాది కోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. కోటేశ్వరరావు పేరుగల వారి మనోభావాలు దెబ్బతినేలా పాట ఉందని ఆయన ఆరోపించారు. వెంటనే దీన్ని తొలగించాలని డిమాండ్‌ చేశారు.

‘కొడకా కోటేశ్వరరావు ఖరుసైపోతవురో..’ పాట కోటేశ్వరరావు అనే పేరు గల వ్యక్తులను కించపర్చేవిధంగా ఉన్నదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే ఈ పాటను సినిమా నుంచి తొలగించాలని ఆయన కోరారు. కాగా, తమపై విమర్శలు చేస్తున్న కత్తి మహేశ్‌ను తిడుతూ పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు ఈ పాటకు స్పూఫ్ చేశారు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాల తర్వాత పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో ఏ భారతీయ చిత్రమూ విడుదలకాని రీతిలో అమెరికాలో ఏకంగా 209 లొకేషన్లలో ‘అజ్ఞాతవాసి’ విడుదలవుతోంది. ఓ ఫ్రెంచ్‌ మూవీ స్ఫూర్తిగా ‘అజ్ఞాతవాసి’ని తెరకెక్కించారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై చిత్ర యూనిట్ సైతం ఎలాంటి ప్రకటనా చేయలేదు.

Comments

comments

Trending

Latest

Song

Coming Soon

అజ్ఞాతవాసి JAN 10
జై సింహ JAN 12
మనసుకు నచ్చింది JAN 26
చలో FAB 2
తొలిప్రేమ FAB 9

Now Showing

ఒక్క క్షణం DEC 28
MCA DEC 21
హలో DEC 22
మళ్ళీ రావా DEC 8
జవాన్ DEC 1

Poll