టాలీవుడ్

‘అజ్ఞాత‌వాసి’లో ఖుష్బూ క్యారక్టర్ ఇదే

agnathavasiపవన్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న ‘అజ్ఞాతవాసి’చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ అంచనాలకు తగినట్లే.. రీసెంట్ గా విడుదలైన ‘అజ్ఞాతవాసి’ టీజర్ సోషల్ మీడియాలో సంచలనం రేపింది. మరో ప్రక్క ఈ చిత్రంలోని పాటలు విడుదల అయ్యి దుమ్ము రేపుతున్నాయి. సోషల్ మీడియాలో లో ట్రెండీ గా నిలుస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో ఖుష్బూ ప్రధాన పాత్రలో నటించారు. జనవరి 10న చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఖుష్భూ చాలా ఏళ్ల తర్వాత తెలుగులో నటించిన చిత్రమిది. ఇందులో తన పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని, ఇలాంటి పాత్ర కోసం ఇన్నేళ్లు ఎదురుచూశానని గతంలో ఆమె అన్నారు. ఇంతకీ ఆమె నటించిన పాత్ర ఏమిటీ అంటే..అందుతున్న సమాచారం ప్రకారం…పవన్ కు ఆమె సవితి తల్లి పాత్రలో కనిపించనుంది.

కాగా సినిమా విడుదలకు రెండు రోజులు మాత్రమే ఉన్న సందర్భంగా ఖుష్బూ ట్విటర్‌ వేదికగా తన ఉద్వేగాన్ని తెలిపారు. చిన్నపాప తన తొలి రిపోర్ట్‌ కార్డు కోసం ఎదురుచూస్తున్న భావన కలుగుతోందని చెప్పారు. ‘జనవరి 10న ‘అజ్ఞాతవాసి’ విడుదల కాబోతోంది. చిన్న పాప తన తొలి రిపోర్ట్‌ కార్డు కోసం ఎదురుచూస్తున్న భావన కలుగుతోంది. చాలా ఆతృతగా ఉంది. దాదాపు పదేళ్ల తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో నటించా. ఈ ఎదురుచూపులకు తగిన ప్రతిఫలం దక్కుతుందని ఆశిస్తున్నాను. త్రివిక్రమ్‌పై నాకున్న నమ్మకం వమ్ముకాదు. థ్యాంక్యూ పవన్‌కల్యాణ్‌ ఫర్‌ ఎవిరిథింగ్‌’ అని ఆమె ట్వీట్‌ చేశారు.

‘అజ్ఞాతవాసి’ ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌ చక్కగా జరిగినట్లు సమాచారం. అమెరికాలో అత్యధిక స్క్రీన్లపై విడుదల కాబోతోన్న తెలుగు సినిమా ఇదేనని చెబుతున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్లో వస్తోన్న మూడో సినిమా ఇది కావడంతో అంచనాలు మరింత పెరిగాయి.

‘అజ్ఞాతవాసి’ చిత్రాన్ని హారిక, హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్స్. ‘కొడకా కోటేశ్వరరావు’ అంటూ పవన్‌ పాడిన పాట విశేషంగా అలరిస్తోంది. పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

వరస ప్రమోషన్స్ తో జనవరి 10న సినిమా విడుదలయ్యే వరకు ‘అజ్ఞాతవాసి’ హంగామా ఆపు అంతూ లేకుండా కొనసాగడం ఖాయం. జనవరి 9న యుఎస్లో భారీ ఎత్తున ప్రిమియర్ షోలతో ‘అజ్ఞాతవాసి’ మొదలవుతుంది.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16