టాలీవుడ్

రాహుల్‌ డైరక్టర్ గా మారుతున్నాడు,డైరక్ట్ చేసేది ఏ హీరోనంటే..

Rahul Ravindran Latest Stills _24_హీరో సుశాంత్‌ కోసం నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడిగా మారారు. ‘అందాల రాక్షసి’, ‘అలా ఎలా’, ‘గాలిపటం’ తదితర చిత్రాల్లో హీరోగా, మహేశ్‌బాబు ‘శ్రీమంతుడు’లో కీలక పాత్రలో నటించిన రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడిగా మారటం తన చిననాటి కల అని అది తీరబోతోందని ఆనందం వ్యక్తం చేసారు. సుశాంత్‌ హీరోగా సిరిని సినీ కార్పొరేషన్‌ నిర్మాణంలో ఈ సిన్మా తెరకెక్కనుందని రాహుల్‌ తెలిపారు.

‘‘చిన్ననాటి కలలను నిజం చేసుకునేందుకు దర్శకత్వంలో తొలి అడుగులు వేయబోతున్నాను.అక్టోబర్‌ లేదా నవంబర్‌లో షూటింగ్‌ స్టార్ట్‌ చేయాలనుకుంటున్నాం’’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ‘‘లవ్లీ స్క్రిప్ట్‌తో రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ఈ సినిమా చేయబోతున్నా’’ అని సుశాంత్‌ ట్వీటారు.

అలాగే ఈ విషయాన్ని సుశాంత్‌ స్వయంగా ఫేస్‌బుక్‌ ద్వారా కూడా తెలిపారు. మంచి కథతో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు చెప్పారు. అందరి సపోర్ట్‌ కావాలని కోరారు. ఈ చిత్రంలో తన మనసుకు అనిపించినట్లు స్వేచ్ఛగా.. ఎటువంటి నిబంధనలు లేకుండా నటించనున్నట్లు పేర్కొన్నారు. దీనికి ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారని భావిస్తున్నట్లు పోస్ట్‌ చేశారు.

Comments

comments

Latest

Recent

Songs

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
లండన్ బాబులు

Now Showing

యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll