బాక్స్ ఆఫీస్

కళ్యాణ్ రామ్ సినిమాకు ఆ రేటు పలికిందా,అందరూ ఆశ్చర్యం

kalyan ramఅనీల్ రావిపూడి డైరక్షన్ లో వచ్చిన పటాస్ సినిమాతో మంచి హిట్ లభించినా ఆ తర్వాత హీరో కళ్యాణ్ రామ్ కు పెద్దగా కలిసి వచ్చిందేమీ లేదు. ఆ తర్వాత తన లుక్ మార్చి.. స్టయిల్ మార్చి పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో చేసిన ఇజం బాక్సాఫీస్ వద్ద భారీ స్దాయిలో బోల్తా కొట్టింది. కొద్దిగా ఊరట ఏమిటంటే…గ్యాప్ తీసుకుని తన తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా జై లవకుశ సినిమా ప్రొడ్యూసర్ గా సినిమా చేయటమే. ఆ సినిమా భాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యి డబ్బులు తెచ్చిపెట్టింది.

అయితే హీరోగా ఆయన చేసే చిత్రాలకు రిలీజ్ బిజినెస్, శాటిలైట్ బిజినెస్ పెద్ద ఎంకరేజింగ్ గా ఉండవనే విషయం తెలిసిందే.హీరోగా ప్రస్తుతం రెండు కొత్త సినిమాల్లో చేస్తున్నాడు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆయన చేస్తున్న చిత్రం శాటిలైట్ రైట్స్ దుమ్ము రేపాయి.

వివరాల్లోకి వెళితే.. సిద్ధార్థ్‌తో ‘180’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన జయేంద్ర దర్శకత్వంలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థ ఓ సినిమాను నిర్మిస్తోంది.ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని జెమినీ టీవి వారు 4.75 కోట్లకు సొంతం చేసికున్నట్లు సమాచారం . ఇదే కళ్యాణ్ రామ్ కెరీర్ లో బెస్ట్ శాటిలైట్ రేట్ కావటం విశేషం. ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నాను హీరోయిన్ గా చేస్తోంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తోంది.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

Now Showing

లండన్ బాబులు 17 NOV 17
ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll