కోలీవుడ్

అలా అంతా అనుకోవాలనే, ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారా?

amyప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 2.0. అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను చిత్రయూనిట్ ఇదివరకే విడుదల చేసింది. ఆ పోస్టర్ లో సూపర్ స్టార్ రజినీకాంత్, అక్ష‌య్ కుమార్ ఉన్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సూపర్ హిట్ చిత్రం రోబో సినిమాకు సీక్వల్‌గా తెరకెక్కుతున్న సినిమా ‘2.0’ కావటంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దాంతో ఈ సినిమా విషయమై రకరకాల టాపిక్స్ నడుస్తున్నాయి. ఫలానా క్యారక్టర్ ఫలానా విధంగా ఉండబోతోందని, ఈ సినిమా కథ ఇదేనంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇక అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో అమీజాక్సన్ ఫీమేల్ లీడ్ పోషిస్తున్నది. తాజాగా అమీజాక్సన్ పై వచ్చే సన్నివేశాలను షూట్ చేయనుంది శంకర్ అండ్ టీం. ఇందుకోసం అమీజాక్సన్ సెట్స్ లో జాయిన్ అయింది. ఈ సందర్భంగా అమీ జాక్సన్ పోస్టర్ ను ట్విట్టర్ ద్వారా డైరెక్టర్ శంకర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూసిన మీడియా ఈ సినిమాలో అమీ జాక్సన్ పాత్రపై ఓ అంచనాకు వచ్చేసింది. ఈ సినిమాలో అమీ..రోబో పాత్ర పోషిస్తోందంటూ కథనాలు ప్రసారం చేస్తోంది. అయితే కథపై ఓ అంచనాకు రాకూడదనే కావాలనే ఈ ఫొటోని శంకర్ టీమ్ వ్యూహాత్మకంగా రిలీజ్ చేసినట్లు తమిళ సిని వర్గాలు అంటున్నాయి.

‘ప్రపంచం కేవలం మనుషుల కోసమే కాదు’ అని రాసి ఉంచిన ఈ ఫస్ట్‌లుక్ లో అమీజాక్సన్ రోబో గెటప్‌తో దర్శమిచ్చింది. ఈ పోస్టర్‌ని దర్శకుడు శంకర్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంటూ.. ‘సినిమాలోని పాట షూటింగ్ ఈ రోజు నుండి ప్రారంభం కాబోతుంది’ అని ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది జనవరి 25న సినిమాను ప్రేక్షకుల ముందుంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

రాజు గారి గది 2 OCT 13
రాజా ది గ్రేట్ OCT 18
ఉన్నది ఒకటే జిందగీ OCT 20
నెక్స్ట్ నువ్వే NOV 03
లండన్ బాబులు

Now Showing

మహానుభావుడు SEP 29
స్పైడర్ SEP 27
జై లవ కుశ SEP 21

Poll