టాలీవుడ్

ఈ యేడు ఆస్కార్ విజేతలు వీళ్లే

oscarయావత్‌ సినీ ప్రపచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్కార్‌ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 90వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో సినీతారల సందోహం, సందడి మధ్య కన్నులపండువగా జరిగింది. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ ఉత్తమ చిత్రం అవార్డు ‘షేఫ్‌ ఆఫ్‌ వాటర్‌’ సినిమాను వరించగా.. ఉత్తమ నటుడు అవార్డును గ్యారీ ఓల్డ్‌మన్‌ (డార్కెస్ట్‌ హవర్‌), ఉత్తమ నటి అవార్డును ఫ్రాన్సెస్‌ మెక్‌డార్మమండ్‌ (త్రి బిల్‌బోర్డ్స్‌ ఔట్‌సైడ్‌ ఎబింగ్‌, మిసోరి) సొంతం చేసుకున్నారు.

ఆస్కార్‌ ఉత్తమ దర్శకుడి అవార్డును ‘ద షేప్‌ ఆఫ్‌ వాటర్‌’ సినిమాకుగాను గిలెర్మో డెల్‌ టోరో సొంతం చేసుకున్నారు. మొత్తానికి 13 నామినేషన్‌లతో ఆస్కార్‌ అవార్డుల రేసులో అగ్రభాగంలో నిలిచిన గ్విలెర్మో డెల్‌ టోరో రొమాంటిక్‌ ఫాంటసీ ‘ద షేప్‌ ఆఫ్‌ వాటర్‌’కు అవార్డుల పంట పండిందని చెప్పవచ్చు. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడితోపాటు బెస్ట్‌ ప్రోడక్షన్‌ డిజైన్‌ అవార్డును ఈ చిత్రం ఎగరేసుకుపోయింది. ఇక బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే అవార్డును ‘గెట్‌ ఔట్‌’ సినిమాకుగాను జోర్డన్‌ పీలె అందుకోగా, బెస్ట్‌ రైటింగ్‌ ఫర్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే అవార్డు ‘కాల్‌ మీ బై యువర్‌ నేమ్‌’ సినిమాను వరించింది. 8 నామినేషన్‌లతో రెండోస్థానంలో నిలిచిన క్రిస్టోఫర్‌ నోలాన్‌ వార్‌ ఎపిక్‌ ‘డంకిర్క్‌’ మూడు అవార్డులు సొంతం చేసుకోగా.. ఏడు నామినేషన్‌లతో సాధించిన మార్టిన్‌ మెక్‌డొనాగ్స్‌ బ్లాక్‌ కామెడీ ‘ద త్రి బిల్‌బోర్డ్స్‌ ఔట్‌సైడ్‌ ఎబింగ్‌, మిసోరి’ చిత్రానికి ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు సహా పలు అవార్డులు వరించాయి.

బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌: సామ్‌ రాక్‌వేల్‌ ( త్రి బిల్‌బోర్డ్స్‌ ఔట్‌సైడ్‌ ఎబింగ్‌, మిసోరి)
బెస్ట్‌ మేకప్‌ అండ్‌ హెయిర్‌ ఆర్టిస్ట్‌ : కజుహిరో సుజి, డేవిడ్‌ మాలినోవిస్కి, లూసీ సిబ్బిక్‌ (డార్కెస్ట్‌ హవర్‌)
బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌: మార్క్‌ బ్రిడ్జెస్‌ (ఫాంతమ్‌ థ్రెడ్‌)
బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌: బ్రియాన్‌ ఫోజెల్‌, డాన్‌ కోగన్‌ (ఇకారస్‌)
బెస్ట్‌ ఫిలీం ఎడిటింగ్‌: లీ స్మిత్‌ (డంకిర్క్‌)
బెస్ట్‌ సౌండ్‌ ఎడిటింగ్‌: అలెక్స్‌ గిబ్సన్‌, రిచర్డ్‌ కింగ్‌ (డంకిర్క్‌)
బెస్ట్‌ సౌండ్‌ మిక్సింగ్‌: మార్క్‌ వీంగార్టెన్‌, గ్రెగ్‌ లాండకెర్‌, గ్యారీ ఏ రిజ్జో
బెస్ట్‌ ప్రోడక్షన్‌ డిజైన్‌: జెఫ్రీ ఏ మెల్విన్‌, షేన్‌ వీవు (ద షేప్‌ ఆఫ్‌ వాటర్‌)
బెస్ట్‌ ఫారెన్‌ లాగ్వెంజ్‌ ఫిలిం ( ఉత్తమ విదేశీ చిత్రం): ఏ ఫెంటాస్టిక్‌ వుమన్‌ (చిలీ)
ఉత్తమ సహాయనటి: అలిసన్‌ జేనీ (ఐ, టోన్యా)
యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిలిం: డియర్‌ బాస్కెట్‌ బాల్‌ చిత్రానికి గాను గ్లెన్‌ కెనీ, కోబ్‌ బ్రయాంట్‌ అందుకున్నారు
యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిలిం: కోకో చిత్రానికిగాను లీ ఉంక్రిచ్‌, డార్లా కే అండర్సన్‌ అందుకున్నారు
బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌: బ్లేడ్‌ రన్నర్‌ చిత్రానికిగాను జాన్‌ నెల్సన్‌, పాల్‌ లాంబర్ట్‌, రిచర్డ్‌ ఆర్‌ హువర్‌, గెర్డ్‌ నెఫ్జర్‌ అందుకున్నారు

Comments

comments

Needi Naadi Oke Katha

Trailer

Latest

Song

Coming Soon

రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2