బాలీవుడ్

45 సెన్సార్ కట్స్, అసలేం ఉందా సినిమాలో

loveసాధారణంగా ఓ సినిమాకు ఎన్ని సెన్సార్ కట్స్ ఉంటాయి. రెండు మూడు లేదా మహా అయితే పది, కానీ ఈ సినిమాకు మాత్రం 45. బాలీవుడ్ చిత్రం ‘లవ్ సోనియా’ పై సెన్సార్ బోర్డు 45సీన్లు కట్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఈ సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది సీబీఎఫ్‌సీ. బాలల అక్రమ రవాణా, విదేశాలకు మహిళలను తరలింపు నేపథ్యంలో దర్శకుడు తాబ్రేజ్ నూరానీ ‘లవ్ సోనియా’ మూవీని తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాలో 45 సీన్లు కట్ చేయడంతో ఒక్కసారిగా చిత్రబృందం డైలమాలో పడింది. సీన్లతో పాటు అభ్యంతరకరంగా ఉన్న కొన్ని ఆంగ్ల, హిందీ పదాలకు కూడా కత్తెర వేసినట్లు తెలిసింది.

లాస్ ఏంజిల్స్ లో తాను చూసిన భాతీయ యువతి నిజజీవిత గాథ ఆధారంగా తబ్రేజ్ నూరానీ తీస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ టైటిల్ రోల్ చేసింది.అమెరికాలో రెండో అతి పెద్ద నగరంగా పిలువబడే లాస్ ఏంజిల్స్ నగరం ఎంత పేరు గాంచిందో… అక్కడ వేశ్యా గృహాలు అంతే ప్రఖ్యాతిని సంపాదించింది. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో వేశ్యా వృత్తి చట్టబద్ధం కావటంతో… ఈ కూపంలోకి దింపటానికి ప్రపంచం నలు మూలల నుండి అమ్మాయిలను బలవంతంగా తీసుకొస్తుంటారు. అయితే ఇక్కడ ఇండియా, చైనా నుంచి కిడ్నాప్ చేసిన అమ్మాయిలే ఎక్కువ శాతం కనిపిస్తుంటారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇలాంటి వాస్తవాలను దగ్గర నుండి చూసిన నూరానీ అనే వ్యక్తి ఈ కాన్సెప్ట్‌తో సినిమా తీస్తున్నాడు.

ఫ్రిదా పింటో, రిచా చడ్డా, అనుపమ్ ఖేర్, మనోజ్ వాజపేయి ఇతర నటీనటులు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్ లో జరిగింది. టెడ్ కప్లాన్, అల్కేశ్ విజాలు సంయుక్తంగా కథను అందించారు.

ఇండియాతోపాటు హాంకాంగ్, లాస్ ఏంజిల్స్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కింది. ‘ది హల్క్’, ‘లైఫ్ ఆఫ్ పై’, ‘జీఐ జో రైస్ ఆఫ్ కోబ్రా’ వంటి హిట్ చిత్రాల నిర్మాత కావటంతో డేవిడ్ రూపొందిస్తున్న ‘లవ్ సోనియా’ పట్ల హాలీవుడ్ లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది.

Comments

comments

Latest

Promo

song

Coming Soon

జై లవ కుశ SEP 21
స్పైడర్ SEP 27
మహానుభావుడు SEP 29
లండన్ బాబులు

Now Showing

కథలో రాజకుమారి SEP 15
ఉంగరాల రాంబాబు SEP 15
శ్రీవల్లీ SEP 15
యుద్ధం శరణం SEP 8
మేడమీదా అబ్బాయి SEP 8
పైసా వసూల్ SEP 1
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18
నేనే రాజు నేనే మంత్రి AUG 11
జయ జానకి నాయక AUG 11

Poll