టాలీవుడ్

అన్నంత పని చేసారు, వర్మ పెద్ద బాంబే వేసారు

ntrఎప్పుడూ ఏదో వివాదంలో ఉండే దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఇప్పుడు మరో సంచలన వివాదానికి తెర తీసే ప్రయత్నం మొదలెట్టారు. అందులో భాగంగా మొదటి అడుగు వేసారు. కొద్ది రోజుల క్రితం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కిస్తానని వర్మ తొలుత చెప్పారు. అంతా బాలయ్యతో ఆ సినిమా ఉంటుందని భావించారు. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు వర్మకు అప్పచెప్పటం లేదని వార్తలు వచ్చాయి. స్వయంగా బాలయ్య సైతం వేరే దర్శకుడు వేటలో ఉన్నారు. దాంతో ఇక తనకు బాలయ్య తో ఎన్టీఆర్ బయోపిక్ తీసే అవకాసం లేదని తెలియటంతో వెంటనే …ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి పేరుతో ఆ సినిమాను తీస్తానని కొన్ని రోజుల క్రితం ప్రకటించారు.

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ టైటిల్‌తో రూపొందించనున్న ఈ చిత్రం లక్ష్మీపార్వతి దృష్టి కోణం నుంచి ఉంటుందని చెప్పారు. అయితే, ఈ చిత్రానికి సంబంధించి ఏ మాత్రం ప్రోపగాండ లేకుండానే సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసేశారు వర్మ. ఇందులో ఓ మహిళ గడప బయట చెప్పులు విడిచి.. ఇంటిలోకి ప్రవేశిస్తూ కనిపించారు. లోపల మరో వ్యక్తి కాషాయ రంగు దుస్తులు ధరించి, కుర్చీలో కూర్చొని ఉన్నారు. వర్మ సినిమాలో.. ఆమె లక్ష్మీపార్వతిగా, లోపల ఉన్న వ్యక్తి ఎన్టీఆర్‌లా కనిపిస్తారని ఇట్టే అర్దమైపోతుంది.

దాంతో ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, లక్ష్మీపార్వతి పాత్రల్లో ఎవరు కనిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. బయోపిక్‌లు తీయడంతో తనదైన మార్కును చూపించే వర్మ గతంలో ‘రక్తచరిత్ర’, ‘రక్తచరిత్ర2’, ‘వీరప్పన్‌’, ‘వంగవీటి’ చిత్రాలను తీశారు.

ఇదిలా ఉంటే బాలకృష్ణ కూడా తన తండ్రి జీవితంపై సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. ఈ చిత్రం తీయనున్నట్లు ఇది వరకే వెల్లడించారు. ఇటీవల ‘పైసావసూల్‌’ విడుదల సమయంలోనూ ఆ విషయాన్ని ప్రస్తావించారు. కొద్దిరోజుల్లోనే తన తండ్రి జీవిత విశేషాలతో తెరకెక్కించే చిత్ర దర్శకుడిని ప్రకటిస్తామని తెలిపారు. ఈలోగా రామ్‌గోపాల్‌ వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి అందరికీ షాక్ ఇచ్చారు.

Comments

comments

Trending

Latest

Trailer

Coming Soon

స్పైడర్ SEP 27
మహానుభావుడు SEP 29
లండన్ బాబులు

Now Showing

జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18

Poll