టాలీవుడ్

‘పద్మావతి’ టైటిల్ మార్చి ,రిలీజ్ డేట్ ప్రకటించారు

padmavathiసంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన పద్మావతి సినిమాపై కొన్ని హిందూ సంస్థలు, రాజ్‌పుత్ కులానికి చెందిన కొందరు నిరసనలకు దిగడంతో ఆ సినిమా నిర్మాతలు దాని విడుదలను నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు చిత్రం టైటిల్ ని ‘పద్మావత్‌’గా మార్చి సినిమా విడుదల తేదీ ఖరారు చేసారు. ఈ సినిమాను జనవరి 25న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

నిజానికి ఈ సినిమా డిసెంబరు 1న విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్‌ పూర్తికాని కారణంగా విడుదల తేదీ వాయిదా పడింది. ఇదిగో ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ ని ఖరారు చేసుకుంది.

రాజ్‌పుత్‌ మహారాణి పద్మని జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. దీపికా పదుకొణె, షాహిద్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన తారాగణంగా నటించారు. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. ఇందులో తమ దేవతలాంటి పద్మిని గురించి తప్పుగా చూపిస్తున్నారని రాజ్‌పుత్‌ కర్ణిసేన కార్యకర్తలు ఆందోళనలు చేశారు. సినిమా విడుదలను వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో సినిమాను దేశవ్యాప్తంగా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. అంతేకాదు భన్సాలీని, దీపికకు చంపుతామని బెదిరించారు. సినిమా సెన్సార్‌ పూర్తైనప్పటికీ ఈ ఆందోళనలు ఆగకపోవడం గమనార్హం.

భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ట్రైలర్ కు విశేషమైన స్పందన లభించింది.
ఇక తమ రాష్ట్రంలో విడుదలకు అనుమతించమని రాజస్థాన్‌ ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఆ రాష్ట్రంలో సినిమా విడుదలయ్యే మార్గం కనిపించడం లేదని చెబుతున్నారు.

మరో ప్రక్క ఈ రాజ్‌పుత్‌ రాణి ‘పద్మావతి’ చరిత్రను విద్యార్థులకు తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఓ పాఠ్యాంశాన్ని తీసుకొస్తామని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు.

వచ్చే ఏడాది నుంచి పాఠ్యపుస్తకాల్లో పద్మావతి ధైర్యసాహసాలు, ఆమె పేరు, ప్రఖ్యాతల గురించి తెలియజేస్తూ ఓ అధ్యాయాన్ని పొందుపరుస్తామని ఆయన వెల్లడించారు. ‘మహారాణి పద్మావతి జీవిత చరిత్ర గురించి ప్రజలెవరికీ తెలియడం లేదు. అందుకే పద్మావతి చరిత్రను తెలియజేసేలా ఓ అధ్యాయాన్ని తీసుకొస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉన్న మధ్యప్రదేశ్‌ పాఠ్యపుస్తకాల్లో చిత్తోర్‌గఢ్‌ను అల్లాఉద్దీన్‌ ఖిల్జి ముట్టడించడం గురించి వరకు మాత్రమే ఉంది. అలా కాకుండా రాణి పద్మావతి గురించి ప్రత్యేక అధ్యాయాన్ని తీసుకురానున్నారు

అక్కడితో ఆగకుండా దీంతో పాటు రాణి పద్మావతి జ్ఞాపకార్థంగా స్మారకమందిరం నిర్మిస్తామని, ఆమె పేరు మీద అవార్డులు కూడా ఇస్తామని ప్రకటించారు.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16