టాలీవుడ్ రివ్యూస్

‘తొలిప్రేమ’ : ఆ టైటిల్ కి న్యాయం చేసావు వరుణ్

చిత్రం: తొలిప్రేమ
నటీనటులు: వరుణ్‌తేజ్‌.. రాశీఖన్నా.. సపనా పబ్బి.. ప్రియదర్శి.. సుహాసిని.. విద్యుల్లేఖ రామన్‌.. హైపర్‌ ఆది తదితరులు
సంగీతం: తమన్‌
ఛాయాగ్రహణం: జార్జ్‌ సి.విలియమ్స్‌
ఎడిటింగ్‌: నవీన్‌ నూలి
నిర్మాత: బి.వి.ఎన్‌.ఎస్‌. ప్రసాద్‌
డిస్ట్రిబ్యూషన్‌: శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి
బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రimage00381517404258

‘ఫిదా’ తో కమర్షియల్ హిట్ కొట్టిన వరుణ్ తేజ మరో లవ్ స్టోరీ తో వెంటనే మన ముందుకు వచ్చాడు. ఈ సారి అందరి జీవితాల్లో ఎప్పుడో అప్పుడు ఎదురయ్యే ఫస్ట్ లవ్ ని కధాంశంగా తీసుకుని వచ్చిన ఓ కొత్త దర్శకుడుకు అవకాసమిచ్చాడు. అదీ తన బాబాయ్ సూపర్ హిట్ చిత్రం టైటిల్ ని రిపీట్ చేస్తూ..దాంతో ఈ సినిమా టాక్ తేడా వస్తే…తనని అందరూ తిట్టి పోస్తారని తెలిసినా ఓకే అన్నాడు. అంత ధైర్యం ఇచ్చిన ఈ చిత్రం కథేంటి…అసలు కొత్త దర్శకుడు ఆఫర్ ఇచ్చేటంత విషయం ఏముంది ఈ సినిమాలో …ఫిదా స్దాయి హిట్ అవుతుందా..అప్పటి తొలిప్రేమతో ఈ సినిమాకు టైటిల్ లో కాకుండా వేరే పోలికలు ఉన్నాయా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

ఇదే కథ

Varun-Tej-Tholiprema-Telugu-Movie-Stills-8‘జ్ఞాపకాలు చెడ్డవైనా మంచివైనా ఎప్పుడూ మనతోనే ఉంటాయి. మోయకతప్పదు’ అనే కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రంలో ఆదిత్య(వరుణ్ తేజ్) కి ఓ ట్రైన్ జర్నీలో వర్ష(రాశిఖన్నా) పరిచయం అవటంతో కథ మొదలవుతుంది. తొలి చూపులోనే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అతని హృదయం చెప్పేయటంతో ఆమెకు వెంటనే ప్రపోజ్ చేస్తాడు. అయితే తెల్లారేసరికి సీన్ మారిపోతుంది. ఆమె చెప్పాపెట్టకుండా ట్రైన్ దిగి వెళ్లిపోతుంది. అయితే విధి ..వాళ్లిద్దరినీ కలిపాలని రాసి ఉన్నప్పుడు మళ్లీ కలవక తప్పదు కదా.

ఇద్దరూ ఒకే ఇంజినీరింగ్ కాలేజీలో తేలతారు. అక్కడ తన ప్రేమ జర్నీను కంటిన్యూ చేస్తాడు వర్ష. కొద్ది రోజులుకు ఆమె కూడా ఆ జర్నీలో జాయిన్ అవుతుంది. అతనితో ప్రేమలో పడుతుంది. అయితే ఆదిత్యకు మొదటి నుంచి కోపం ఎక్కువ..ఆ షార్ట్ టెంపర్ వీళ్లద్దరు విడిపోయేలా చేస్తుంది. చిన్న గొడవ …మాటలతో చినుకు చినుకు గాలి వాన అయిన మాదిరిగా పెద్దదై బ్రేక్ అప్ కు దారి తీస్తుంది. కానీ విధి.. వీళ్లిద్దరిని కలపాలని నిర్ణయించుకుందని చెప్పుకున్నాం కదా..

మళ్లీ ఆరేళ్ల తర్వాత వీళ్లిద్దరూ లండన్ లో ఉద్యోగ నిమిత్తం వెళ్లి అక్కడ ఓ కనస్ట్రక్షన్ కంపెనీలో కలుస్తారు. మరి ఈ సారైనా వీళ్లద్దరూ కలిసి ఉంటారా…తమ విభేధాలకు స్వస్ది చెప్తారా…ఆది తన షార్ట్ టెంపర్ నివదులుకున్నాడా…వర్ష అతన్ని ఏక్సెప్టు చేసిందా వంటి విషయాలు తెరపై చూడాల్సిందే.

వీరిద్దరూ ఒకే కళాశాలలో చేరతారు. తనను ప్రేమించాలంటూ ఆదిత్య.. వర్ష వెంట పడుతూ ఉంటాడు. క్రమక్రమంగా ఆదిత్య ప్రేమలో పడుతుంది వర్ష. ఆదిత్యకి కోపం ఎక్కువ. దేనికైనా ముందు గొడవపడి తర్వాత ఆలోచిస్తాడు. కానీ, వర్ష అలా కాదు. ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. వీరిద్దరి మధ్య ఈ తేడానే గొడవలకు కారణమవుతుంది. దీంతో ఆదిత్య-వర్ష విడిపోతారు. మళ్లీ ఆరేళ్ల తర్వాత లండన్‌లో ఇద్దరూ కలుసుకుంటారు. అక్కడ వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది?ఒకరి మీద ఒకరికి కోపం తగ్గిందా? అన్నదే కథ.

ఏం చెప్పదలుచుకున్నాడు,ఎలా ఉంది

ఇక ఈ సినిమాతో దర్శకుడు తొలి ప్రేమ కు ఉన్న గాఢతను చెప్పదలుచుకున్నాడు. కొన్ని అంసదర్భ సన్నివేశాలు అక్కడక్కడా తగిలినా..ఓవరాల్ గా ఓ మంచి ఫీల్ గుడ్ సినిమాని మంచి విజువల్స్ తో అంతకు మించి చక్కటి డైలాగులతో అందించాడు దర్శకుడు. అయితే కథా పరంగా చూస్తే ఏది కొత్తగా అనిపించదు. కానీ ఇలాంటివి …కథలుగా విశ్లేషించుకుంటానికి ఏమీ ఉండవు. ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాలో ఉన్న విషయాన్ని మన మనస్సులోకి ఎంతలా ఇంజెక్టు చేసాడన్నది ప్రధానం. ఆ విషయంలో దర్శకుడు వందకు వందశాతం విజయం సాధించాడనే చెప్పాలి.

ఫస్టాఫ్ ప్రియదర్శన్ కామెడీతో,సెకండాఫ్ హైపర్ ఆది కామెడీతో …నడుపుతూ… ఎమోషన్స్ బాలెన్స్ చేస్తూ సినిమాని ఎక్కడా జర్క్ లు లేకుండా ముందుకు తీసుకువెళ్లాడు. వరుణ్ తేజ, రాశి ఖన్నా కూడా ఈ సినిమాలో బాగా చేసారు. మరీ ముఖ్యంగా రాశి ఖన్నా … చాలా కొత్తగా కనిపించింది.

కొత్త దర్శకుడు అయినాVarun-Tej-Tholiprema-Telugu-Movie-Stills-6 (1)

ఇక ఈ చిత్రం దర్శకుడు వెంకీ అట్లూరి కు ఇది తొలి చిత్రం . అయినా ఆ తడబాటు ఎక్కడా కనపడదు. చాలా అ నుభవమున్న దర్శకుడులా ఫ్రేమ్స్ ని పేర్చుకుంటూ పోయాడు. అందుకు టెక్నీషియన్స్ కూడా బాగా సహకరించారు. మరీ ముఖ్యంగా కెమెరామెన్.. జార్జ్ సి.విలియ‌మ్స్ ప్రతీ ఫ్రేమ్ ని . అందంగా తెర‌పై చూపించాడు. సంగీతం కూడా వినసొంపుగా మెలోడీగా ఉంది. క్లైమాక్స్ సీన్స్ ను ఇంకాస్త బాగా, బలంగా రాసుకుంటే ఇంకా బాగుండేది. మిగతా విభాగాలు బాగున్నాయి.

టైటిల్ నే ..

పవన్ తొలి ప్రేమ నుంచికేవలం టైటిల్ నే తీసుకున్నారు. టైటిల్ కు తగ్గ న్యాయం కూడా చేసారు కాబట్టి నో ప్లాబ్లం. ఇప్పుడు మరింత ఉత్సాహంగా పవన్ వేరే హిట్ సినిమా ల టైటిల్స్ కూడా తీసుకుని సినిమాలు చేయచ్చు.

చివరి మాట

ఇలాంటి సినిమాలకు యూత్ బ్రహ్మరధం పడతారని గతంలో ప్రూవ్ అయ్యింది. ఈ సారి కూడా అదే మ్యాజిక్ జరగొచ్చు. ఫిదా స్దాయి హిట్ అవుతుందో లేదో కానీ ..సినిమా ఫ్యామిలీలు సైతం వెళ్లి చూసి వచ్చేలా ఉంది.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

tr> tr> tr>
ఇంటిలిజెంట్ FEB 9
గాయత్రి FEB 9
తొలిప్రేమ FEB 10
అ! FEB 16
ఆచారి అమెరికా యాత్ర FEB 16
మనసుకు నచ్చింది FEB 16
కిరాక్ పార్టీ FEB

Now Showing

tr> tr>
చలో FEB 2
టచ్ చేసి చూడు FEB 2
భాగమతి JAN 26
రంగుల రాట్నం JAN 14
జై సింహ JAN 12
గ్యాంగ్ JAN 12
అజ్ఞాతవాసి JAN 10