Needi-Naadi-Oke-Katha-baner1
టాలీవుడ్

రివ్యూ ‘గ్యాంగ్’ : పెద్ద బ్యాంగ్ ఏమీ కాదు కానీ..

GANG-MOVIE-1515699294-1819సూర్య సినిమాలకు తెలుగులో ఈ మధ్యన అంటే క్రేజ్ తగ్గింది కానీ కొద్ది కాలం క్రిందట వరకూ మంచి ఊపే ఉండేది. మాస్ సినిమాలకు కేరాఫ్ ఎడ్రస్ లా సూర్య సినిమాలు చెలరేగిపోయేవి. అయితే విభిన్నత పేరుతో ఆయన చేసే ప్రయోగాలు వికటించి ఆయన మార్కెట్ ని పడేసాయి. ఈ టైమ్ లో మళ్లీ ఫామ్ లోకి రావటం కోసం… హిందీలో ఓ సూపర్ హిట్ చిత్రం( ‘స్పెషల్ చబ్బీస్’)ని తీసుకుని తమ దైన శైలిలో నేటివిటి అద్ది మన ముందుకు వచ్చారు. రీమేక్ కాబట్టి సేఫ్ బెట్ అని భావిస్తూ చేసిన ఈ చిత్రం ఏ మేరకు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అసలు ఈ గ్యాంగ్ కథేంటి…సూర్యకు ఈ సినిమా హిట్ ఇచ్చిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథ…కమామిషు

తండ్రి పనిచేసే సీబీఐ ఆఫీస్ లోనే తనూ ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకుంటాడు తిలక్ (సూర్య). అందుకు అభ్యంతరం ఏమీ లేదు కూడా. అయితే ఆ తండ్రి చేసేది ..ప్యూన్ జాబ్. దాంతో అతని కొడుక్కి తాము ఆఫీసర్ గా జాబ్ ఇస్తే…అతనూ తమ ప్రక్కన సమాన హోదాలో కూర్చుంటాడు అనే భయంతో ..ఇంటర్వూలో ఫెయిల్ చేస్తారు. దాంతో ఆ కొడుకుకు మండిపోతుంది..ఆ నా ..కొడుకుల అంతం చూడాలి అనుకుంటాడు. అయితే అందుకు …దొడ్డిదారే శరణ్యం అనుకుంటాడు. తనలాంటి మరికొంతమందిని పోగుచేసి .. నకిలీ సీబీ ఐ టీమ్ ని తయారు చేసి..రైడ్స్ చేస్తూంటాడు. కొద్ది రోజులు బాగానే నడిచినా …కాలక్రమేణా ఈ నకిలి టీమ్ …సీబీఐకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. దాంతో ఈ టీమ్ ని పట్టుకోవటానికి శివశంకర్ (కార్తీక్) అనే సీనియర్ అధికారిని రంగంలోకి దించుతారు. అక్కడ నుంచి ఎత్తులకు పై ఎత్తులతో కథ జరుగుతుంది. నడిచి..నడిచి (సెకండాఫ్ నడకే..పరుగు పెద్దగా లేదు) ఓ చోట క్లైమాక్స్ కు వస్తుంది. అప్పటికైనా నకిలీ గ్యాంగ్ ని ఒరిజనల్ సీబీఐ అథికారి పట్టుకోగలిగాడా..చివరకు ఏమైంది , ఈ కథలో కీర్తి సురేష్ పాత్ర ఏమిటి,రమ్యకృష్ణ ఏం చేస్తూంటుంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

హిందీ సినిమాకు ఈ గ్యాంగ్ కు తేడా ఏంటి

హిందీ ‘స్పెషల్ చబ్బీస్’లో సినిమా మొత్తం సీరియస్ గా నడుస్తూంది. చాలా థ్రిల్లింగ్ గా కథనం పరుగెడుతుంది. దాని రీమేక్ వెర్షన్ గా వచ్చిన ఈ సినిమాలో మొత్తం మార్చేసారు. సూర్య బాడీ లాంగ్వేజ్ కు , ఇక్కడ మన సౌత్ ఇండియా సినిమాల మసాలా లాంగ్వేజ్ కు అణుగుణంగా దర్శకుడు రీరైట్ చేసాడు. ప్రతీ సీన్ ని మార్చేసాడు. ఈ క్రమంలో ఒరిజనల్ లో ఉన్న బ్యూటీ అయితే మిస్సైంది. కానీ ఓ కొత్త సరదా కథ తయారైంది. యాజటీజ్ ‘స్పెషల్ చబ్బీస్’ ని సీన్ బై సీన్ తీస్తే ఆడుతుందో లేదో కానీ ఈ కొత్త మార్పులు సూర్య అభిమానులను కొంతలో కొంతైనా అలరిస్తాయనటంలో సందేహం లేదు. అయితే హిందీలో ఎంతో సహజంగా అనిపించే ఈ చిత్రం రీమేక్ అయ్యేసరికి ఆ ఫ్లేవర్ ని పోగొట్టుకునే కృత్రమంగా తయారైంది. ఏదో కామెడీ సినిమా చూసిన ఫీలింగ్ ని తీసుకువచ్చింది.

తిట్టుకుంటే ఫలితం లేదు

తమిళ డబ్బింగ్ సినిమా చూస్తూ తమిళ వాసన వస్తున్నాయి సీన్స్ అనుకోవటంలో అర్దం లేదు. అయితే ఈ సినిమాలో చాలా సీన్స్ తమిళ సినిమా మీరు చూస్తున్నది అని పదే పదే గుర్తు చేస్తూంటాయి. అది డబ్బింగ్ చేసిన నిర్మాతల సమస్య కన్నా …ఒరిజనల్ లో తమిళ నేటివిటిని ఎక్కువ అద్దిన దర్శకుడుకు ఆ క్రెడిట్ వెళ్తంది.

టెక్నికల్ గా …

సినిమాని టెక్నికల్ గా బాగానే తీర్చి దిద్దారు దర్శకుడు. ముఖ్యంగా ఎనభైల నాటి వాతావరణాన్ని తీసుకుని రావటంలో టీమ్ కృషి చెప్పుకోదగినదే. అయితే ఎనభైలనాటి వాతావరణం అంటే కేవలం మొబైల్స్ లేకపోవటమే కాదు కదా… అప్పటి హెయిర్ స్టైయిల్ నుంచి ..డ్రస్ సెన్స్ నుంచి అంతా వేరే. సుబ్రమణ్యపురంలో అది మనకు స్పష్టంగా కనపడుతుంది. అది తేలేకపోయారు.

చివరి మాట

ఈ సినిమా వీకెండ్ కు మంచి కాలక్షేపం ఇస్తుంది. స్పెషల్ ఛబ్బీస్ చూసిన వారు కూడా మళ్లీ చూడచ్చు . అయితే సూర్య హిట్ సిమిమాలు యముడు లాంటివి దృష్టిలో పెట్టుకుని ఆ స్జాయి యాక్షన్ ని ఎక్సపెక్ట్ చేసి వెళ్లపోతేనే సుమా.

Comments

comments

Needi Naadi Oke Katha

Trailer

Latest

Song

Coming Soon

నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2