టాలీవుడ్ రివ్యూస్

‘2 కంట్రీస్’ : కామెడీ లేదు బాస్

చిత్రం: 2 కంట్రీస్‌
నటీనటులు: సునీల్‌, మనీషారాజ్‌, సంజన, రాజారవీంద్ర, శ్రీనివాస్‌రెడ్డి, పృథ్వీ తదితరులు
సంగీతం: గోపి సుందర్‌, ఛాయాగ్రహణం: సి.రాంప్రసాద్‌
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరావు, నిర్మాత: ఎన్‌.శంకర్‌
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్‌.శంకర్‌, సంస్థ: మహాలక్ష్మి ఆర్ట్స్‌
విడుదల తేదీ: 29-12-2017

2-countries

కమిడియన్ గా ఉండగా చేసిన ప్రతీ క్యారక్టర్ హిట్టే. సినిమా ప్లాఫ్ అయినా సునీల్ గురించి మాట్లాడుకునే పరిస్దితి తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత మెల్లిగా హీరోగా మారాక సీన్ మారింది. ముఖ్యంగా బొద్దుతనం పోయి..సిక్స్ ప్యాక్ వచ్చాక…సునీల్ సినిమాలు పెద్దగా వర్కవుట్ అవటం తగ్గిపోయాయి. వాటిల్లో కామెడీ తగ్గిపోయి…స్టార్ హీరోల సినిమాల లక్షణాలు సంతరించుకోవటం దెబ్బ కొట్టాయి. సునీల్ సినిమాకు కథ,పాటలు, ఫైట్స్ కోసం వెళ్లం కామెడీ కోసం వెళ్తాం అనే ప్రేక్షకులను అలరించలేని పరిస్దితి వచ్చేసింది. దాంతో వరస ఫ్లాఫ్ ల నుంచి కోలుకునేందుకు ఓ ఫ్యామిలీ కామెడీ చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు. అదీ ఆల్రెడీ ప్రూవైన రీమేక్ అయితే సేఫ్ అని ధైర్యం తెచ్చుకుని మళయాళ రీమేక్ కు సై అన్నాడు. మునపటి సునీల్ లా కనిపిస్తూ కామెడీ చేస్తానని ప్రామిస్ చేస్తూ వచ్చిన ఈ చిత్రం ఏ మేరకు ఆ విషయంలో సక్సెస్ అయ్యిందో రివ్యూలో చూద్దాం.

కథ

డబ్బు పిచ్చి కాస్తంత ఎక్కువగా ఉన్న ఉల్లాస్ కుమార్ కు అందుకోసం రకరకాల మోసాలు చేస్తూంటాడు. అయితే అన్ని విలేజ్ సైడ్ వేషాలు,మోసాలే కాబట్టి అంతగా ప్రమాదం ఉండదు. ఉన్నా తనకున్న అతి తెలివితో అల్లుకుపోయి అలవోకగా దాటేస్తూంటాడు. అతని దురదృష్టమో..అదృష్టమో…అనుకోకండా… ఈ మోసాల కుమార్ కు ఓ సారి తన చిన్న నాటి స్నేహితురాలు లయి (మనీషారాజ్) లైన్ లోకి వస్తుంది. ఆమె ఫారిన్ లో సెటిలైందని తెలుసుకుని, ఎంతో ఆస్ది ఉందని విని, ఆమెకు ఆ మాటలు ఈ మాటలు చెప్పి, చిన్న నాటి విషయాలతో మాయ చేసి లైన్ లో పెట్టేస్తాడు ఫోన్ లోనే. దాంతో ఆమె అమెరికానుంచి ఈ ఉల్లాస్ ని వెతుక్కుంటూ వచ్చి ఉత్సాహంగా పెళ్లి కూడా చేసేసుకుంటుంది. దాంతో తన రొట్టి విరిగి నేతిలో పడిందనుకునే సమయంలో ఉల్లాస్ కు ఓ చేదు నిజం తెలుస్తుంది. తను తాళి కట్టిన భార్య…పెద్ద తాగుబోతు అని..ఇరవై నాలుగు గంటలూ అదే పని మీద ఉంటుందని. మొదట షాకైనా..తర్వాత …ఆమె ఆస్ది కదా మనకు కావాల్సింది అని లైట్ తీసుకుని ఆమెతో అమెరికా చెక్కేస్తాడు. అక్కడ మరో విషయం రివీల్ అవుతుంది. ఆమెకు ఆస్ది రావాలంటే కోర్టు నియమం ప్రకారం తాగుడు మానేయాలి. ఇది తెలుసుకున్న మన ఉల్లాస్ కుమార్ లో ఉల్లాసం నశిస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది. ఉల్లాస్ ఏం చేసాడు..తన భార్య చేత తాగుడు మానిపించాడా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. లేదా ఎవరైనా ఆల్రెడీ సినిమా చూసిన వారిని పట్టుకుని మిగతా కథ అడగాల్సిందే.

సీన్ రివర్స్ ..రిజల్ట్ రివర్స్

ఆ రోజుల్లో భర్త తాగుబోతు ,తిరుగుబోతు అయితే అతన్ని మార్చుకున్న కథలు తెరకెక్కేవి. ఇప్పుడు రివర్స్ లో భార్య తాగుబోతు అయితే ఆమె చేత ఆ తాడుగు మాన్పించే భర్త కథ కాస్త వింతగానే అనిపిస్తుంది. అయితే ఆ వింతనుంచి మాత్రం కొత్త సీన్స్ అయితే పుట్టలేదు. పాత సీన్సే రిపీట్ అయ్యాయి. అలాగే సునీల్ చేయాల్సిన కథ కాదు ఇది అనిపిస్తుంది. ఏ వెంకటేష్ లాంటి హీరోనో చేస్తే మరింత రాణించే కథ ఇది. సునీల్ ..సెంకడాఫ్ లో కథలో కాస్త సెంటిమెంట్ సీన్స్ ఉన్న చోట్ల డల్ అయ్యిపోయాడు. కామెడీ చేసేటప్పుడు ఉన్న ఈజ్ మాయిమైపోయింది. దాంతో అసలే బోర్ ఉన్న కథ కాస్తా మరింత భారంగాతయారై సహన పరీక్ష పెట్టింది.

టెక్నికల్ గా చెప్పాలంటే ఈ సినిమాలో కెమెరా వర్క్ హైలెట్ గా ఉంది. డైలాగులు ప్రాసలతో విసుగించాయి. పాటలు బాగోలేవు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటర్ …మరింతగా తన కత్తెరకు పదును పెట్టాల్సింది. లెంగ్త్ విషయంలోనూ దర్శకుడు జాగ్రత్తలు తీసుకోవాల్సింది.

ఫైనల్ గా ..

సునీల్ సినిమా అంటేనే కామెడీ ఎక్సపెక్ట్ చేసి వెళ్తారు. ఫ్యామిలీ కథ చెప్పినా సెంటిమెంట్ ఆయింట్ మెంట్ రాసినా, యాక్షన్ తో హడావిడి చేసినా ఆ కామెడీ టింజ్ మిస్ కాకుండా ప్రవహిస్తూనే ఉండాలి. అది మిస్సైతే సునీల్ ఎందుకు ఎవరైనా చెయ్యచ్చు. అదే ఇక్కడ జరిగింది. ఫస్టాఫ్ లో ఉన్న కామెడీ కాస్త సెకండాఫ్ కు వచ్చేసరికి పూర్తిగా మాయమైపోయింది. దాంతో సునీల్ సినిమా ..ఓ కామెడీ చూద్దాఅని వచ్చిన వారికి నిరాశే.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16