టాలీవుడ్ రివ్యూస్

‘ఇంటెలిజెంట్’ అతి పాత తెలివితేటలు

intelegentరస ఫ్లాఫులు…ఏ డైరక్టర్ తో చేసినా వర్కవుట్ కావటం లేదు..డెస్పరేట్ గా హిట్ కావాలి..ఆ టైమ్ లో …మెగా స్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడుతో సినిమా అంటే ఆ ఉత్సాహమే వేరు…తన కెరీర్ మళ్లీ గాడిలో పడిపోయిందనిపిస్తుంది. అయితే కేవలం దర్శకుడుని ఎంపికలోనే హిట్ వస్తుందా…ఇది సాయి ధరమ్ తేజ తాజా చిత్రం ముందున్న ప్రశ్న. అసలు తన కెరీర్ పూర్తిగా ప్లాఫ్ దారి పట్టడానికి కారణమైన పాత కాలం కధల ఎంపిక..ఈ సారైనా మారిందా…ఇది ఆయన అభిమానుల మనస్సులో ఉన్న అనుమానం ..వీటిన్నటికి సమాధానాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తేజూ (సాయి ధరమ్ తేజ) చిన్నప్పటినుంచీ చాలా తెలివైనోడు. తన తెలివిని చూసి చేరదీసి తనను ఇంతవాడిని చేసిన చేసిన నందకిషోర్ (నాజర్) అభిమానం. అందుకే ఎన్ని ఆఫర్స్ వచ్చినా ఆయన సంస్ధలోనే ఉద్యోగిగా కొనసాగుతూంటాడు. అయితే రోజు ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. అంతేకాదు ఆయన సంస్దని ఓ మాఫియాడాన్ విక్కీభాయ్ (రాహుల్ దేవ్)కు రాసేస్దాడు. ఈ విషయం తెలిసిన తేజూ షాక్ అవుతాడు. దీని వెనక ఉన్న అసలు విషయం ఏంటో కూపీలాగుతాడు. ఈ ప్రాసెస్ లో అతను ధర్మాబాయ్ గా అవతారమెత్తుతాడు. విక్కీభాయ్ ని అంతమెందించటానికి ధర్మా బాయ్ గా తేజూ ఎందుకు మారాడు…అసలు అతని ప్లాన్ ఏంటి…నందకిషోర్ ది అసలు ఆత్మహత్యా..లేక హత్యా..అసలేం జరిగింది..చివరకు ఆ మాఫియా డాన్ కు తేజూ ఎలా బుద్ది చెప్పాడు వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

అఖిల్ కు బాబులా

సినిమా అంటే ఎలా ఉండకూడదో అలా ఉంది. పూర్తిగా బోర్ కొట్టే ఎలిమెంట్స్ అన్ని ఏర్చికూర్చి అల్లినట్లున్న ఈ కథను అంతే నీరసంగా వినాయిక్ డైరక్ట్ చేసారు. అయితే వినాయిక్ కథ విషయంలో జడ్జిమెంట్ ఏమైందా అని డౌట్ వస్తుంది. ఇదే వినాయిక్ డైరక్ట్ చేసిన అఖిల్ సినిమాకు బాబులా విసిగిస్తుంది. ఏ సీన్ ఎందుకు వస్తుందో..అర్దం కాదు..హీరోయిజం లేపే నాలుగు సీన్స్…కామెడీ సీన్స్ నాలుగు, హీరోయిన్ తో రొమాన్స్ సీన్స్ మరో నాలుగు కూర్చి అల్లేసినట్లు అనిపిస్తుంది. అయితే ఎంత రొటీన్ సినిమా అయినా ఇంత రొటీన్ గా ఉంటే కష్టమనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో మరో ప్రధాన లోపం..విలన్ పాత్ర బలంగా లేకపోవటం..ఆ పాత్రకు సరైన లక్ష్యం లేకపోవటమే. విలన్ పాత్ర సరిగ్గా లేకపోవటంతో హీరో పాత్ర కే ఎసరు వచ్చింది. ఇక బ్రహ్మానందం పాత్ర, పాముని పట్టుకోమంటూ హీరో పురమాయించినప్పుడు వచ్చే సీన్స్ …సహన పరీక్షకు పరాకాష్టలా ఉన్నాయి. క్లైమాక్స్ సైతం బాగా పాతకాలం రోజుల్లో క్లైమాక్స్ ని గుర్తు చేస్తుంది.

హీరో ఎలా చేసాడు

ఇలాంటి సినిమాల్లో హీరో ఎంత బాగా చేసినా ..గుర్తింపు రాదు…అదే జరిగింది. ఫైట్స్ లో పాటల్లో చాలా ఈజ్ ప్రదర్శించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఇక హీరోయిన్ తో లవ్ ట్రాక్ అయితే ఆ సీన్స్ ఎప్పుడు అయిపోతాయా అని ఎదురు చూసేలా ఉన్నాయి.లావణ్యా త్రిఫాటి గురించి మాట్లాడుకునేందుకు ఏమీ లేదు.

టెక్నికల్ గా

సినిమా కథ విషయంలో ఫెయిలైంది. దాంతో డైలాగులు కూడా కుదరలేదు. డైరక్షన్ అయితే వినాయిక్ చేసినట్లు లేదు. సినిమాటోగ్రఫి ఉన్నంతలో బాగుంది. ఎడిటింగ్ …ఇంకాస్త సీన్స్ కట్ చేసి ఉంటే బాగుండేది అనే భావన తెచ్చింది. తమన్ పాటలు కూడా సోసో గా ఉన్నాయి.

ఏం బాగున్నాయి

సినిమాలో పృధ్వీ మీద, పోసాని మీద చేసిన కామెడీ సీన్స్ బాగున్నాయి. రెండు పాటలు బాగున్నాయి.

సినిమా చూడచ్చా?

అనవసరం…

చివరి మాట

సినిమా అంతా చూసాక ..ఒకటే మాట అనిపిస్తుంది. అంత పెద్ద డైరక్టర్ కూడా సాయి ధరమ్ తేజ కెరీర్ ని గాడిలో పెట్టలేకపోయాడే అని..అలాగే వినాయిక్ కు కూడా ఓ రకంగా ఫంధా మార్చుకోవాలని ఇచ్చే స్వీట్ వార్నింగ్ ఈ సినిమా .

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

tr> tr> tr>
ఇంటిలిజెంట్ FEB 9
గాయత్రి FEB 9
తొలిప్రేమ FEB 10
అ! FEB 16
ఆచారి అమెరికా యాత్ర FEB 16
మనసుకు నచ్చింది FEB 16
కిరాక్ పార్టీ FEB

Now Showing

tr> tr>
చలో FEB 2
టచ్ చేసి చూడు FEB 2
భాగమతి JAN 26
రంగుల రాట్నం JAN 14
జై సింహ JAN 12
గ్యాంగ్ JAN 12
అజ్ఞాతవాసి JAN 10