టాలీవుడ్ రివ్యూస్

‘టచ్‌ చేసి చూడు’ : టైటిల్ లోనే చెప్పేసాడు

న‌టీన‌టులు: ర‌వితేజ‌.. రాశీఖ‌న్నా.. సీర‌త్ క‌పూర్‌.. సుహాసిని.. ముర‌ళీశ‌ర్మ‌.. స‌త్యం రాజేష్‌.. వెన్నెల కిషోర్‌.. జ‌య‌ప్ర‌కాష్‌.. ఫ్రెడ్డీ దారువాలా త‌దిత‌రులు.
సంగీతం : జామ్ 8
నేపథ్య సంగీతం: మణిశర్మ
కథ : వక్కంతం వంశీ
స్క్రీన్ ప్లే : దీపక్ రాజ్
మాటలు : శ్రీనివాస్ రెడ్డి
అడిషనల్ డైలాగ్స్: రవిరెడ్డి మల్లు,కేశవ్
ఎడిటింగ్ : గౌతం రాజు
ఆర్ట్: రమణ
ఛాయాగ్రహణం : చోటా.కె.నాయుడు
నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ
దర్శకత్వం : విక్రమ్ సిరికొండ.

మధ్యన వరస ఫ్లాఫులు…దాంతో ఏడాది గ్యాప్…రాజా ది గ్రేట్ రిలీజ్..హమ్మయ్య ఊపిరి పీల్చుకున్నాడు…అయితే ఈ గ్యాప్ లో నాని, రాజ్ తరుణ్, శర్వానంద్ వంటి యంగ్ హీరోలు తన ఫన్ స్లాట్ లోకి వచ్చేసి సెటిలయ్యిపోయారు. దాంతో తిరిగి కబ్జా అయిన తన స్దానాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిన సిట్యువేషన్. పెద్ద డైరక్టర్స్ అంతా …యంగ్ హీరోల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. తనతో చేద్దామనుకునే దర్శకులకు మార్కెట్ కనపడటం లేదు. ఇలాంటి పరిస్దితుల్లో కొత్త నీరుతో తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో …టచ్ చేసి చూడు మొదలెట్టాడు. కొత్త నీరు ..సరికొత్త ఆలోచనలు ఇచ్చిందా…కొత్తకథతో వచ్చిందా…రవితేజకు మళ్ళీ పాత రోజుల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేసిందా..ఇంతకీ ఎవర్ని ఎవరు టచ్ చేసి చూడాలి వంటి విషయాలు కోసం రివ్యూలో చూద్దాం ..రండి

కథేంటో చూద్దాం…

పాండిఛ్చేరిలో ఫ్యామిలీతో ప్రశాంతంగా బ్రతుకుతున్న కార్తికేయ (రవితేజ) కి ఓ రోమాంచితమైన ఫ్లాష్ బ్యాక్ ఉందని ఎవరికీ తెలియదు. అయితే నివురు గప్పిన నిప్పుని ఎంతో కాలం దాచలేం అన్నట్లుగా..కార్తికేయ అసలు ఎవరనే బయిటపడే సమయం తన చెల్లి వలన వస్తుందని కార్తికేయ ఊహించలేదు. అతని చెల్లి ఓ మర్డర్ ని కళ్లారా చూస్తుంది. ఆ మర్డర్ చేసిన వాడు ఫలానా అని బొమ్మ గీయించేందుకు సహకరిస్తుంది. అయితే ఆ ఫలానా మరెవెరో కాదు…తన చేతిలో చనిపోయిన ఇర్ఫాన్ అని కార్తికేయ గుర్తు పడతాడు. అయితే ఇర్ఫాన్ …అప్పుడు చచ్చిపోతే మళ్లీ ఎలా బ్రతికి వచ్చి మర్డర్ చేసాడు. అదే కన్ఫూజన్. అయినా కార్తికేయ ..ఆ ఇర్ఫాన్ ని గతంలో ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది పెద్ద క్వచ్చిన్..దానికి సమాధానం..సెకండాఫ్ లో చెప్పే పెద్ద ప్లాష్ బ్యాక్ లో దొరుకుతుంది. ఇంతకీ ఆ ప్లాష్ బ్యాక్ ఏమిటీ అంటారా…సినిమా చూస్తే తెలుస్తుంది. ఇంత కథ చెప్పారు..ఇందులో హీరోయిన్స్ పాత్రలు ఏవీ అంటే…కథలో అవి ఇమడలేదు కాబట్టి ఇక్కడా వాటి ప్రస్దావన రాలేదు. వాళ్ళ గురించి తెలియాలన్నా సినిమా చూడటమో లేక చూసినవారిని అడగటమో చెయ్యండి.

విశ్లేషణ

కథంతా చదివితే మీకు భాషా , ఇంద్ర, సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు వంటి బోలెడు సినిమాలు కళ్ల ముందు మెదిలి ఉంటాయి కదా. ఎగ్జాట్లీ ..ఇదీ అలాంటి కథే. భాషా స్క్రీన్ ప్లేకే మళ్లీ ఆర్డర్ వేసి ఈ సినిమాని తెరకెక్కించాడు. ఫస్టాఫ్ అంతా …హీరో పాండిచ్చేరిలో ప్రశాంత జీవితం..ఓ హీరోయిన్ తో సరసం..ఇంటర్వెల్ లో ఇతను మరెవరో కాదు..ఫలానా ప్రచండమైన పోలీస్ ఆఫీసర్..జనాలు టచ్ చేయటానికే భయబడే వ్యక్తిత్వం అని బిల్డప్. మరి అలాంటి వాడు ఇలా పాండిచ్చేరి వచ్చి ఎందుకు సైలెంట్ అయ్యిపోయాడు అంటే ఓ పెద్ద ప్లాష్ బ్యాక్. విక్రమార్కుడు ని గుర్తు చేసే డైలాగులు. మరి ఇలాంటి స్క్రీన్ ప్లేతో వచ్చిన సినిమా చూస్తే…రొటీన్ అనిపిస్తుంది కదా అంటారు కదా అదే జరిగింది.

టెక్నికల్ గా విషయం ఉందా

సినిమా టెక్నికల్ గా సౌండ్ గానే ఉంది. రవితేజ సినిమా కదా ఆ మాత్రం ఉంటుంది ..బాగానే ఖర్చు పెడతారు కదా అంటారా..అదీ నిజమే. ఇక పాటలు..రవితేజ గత చిత్రాల్లో లాగ హాంటింగ్ అయితే లేవు..బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. కొత్త డైరక్టర్ ..పాత కథని పాతగానే చూసాడు.

ఎవరెలా చేసారు

రవితేజ ఎప్పటిలాగే ఎనర్జీతో దుమ్ము రేపాడు అనం.ఎందుకంటే ఈ సినిమాలో చాలా సీన్లు ఆయనకా అవకాసం ఇవ్వలేదు. ఇక హీరోయిన్స్ కేవలం గ్లామర్ డాల్సే..పాపం వాళ్లకు అసలు కథలో స్దానమే లేదు.

ఇంతకీ చూడచ్చా

విశ్లేషణ సరే..సినిమా చూడచ్చా అంటారా… రవితేజ సినిమా కామెడీ ఉంటుంది.. అని ఆవేశపడితే ..అది మన అనవసర ఆతృతే అని సినిమా ప్రారంభమైన అరగంటలోపే తేలిపోతుంది. కాబట్టి రవితేజ వీరాభిమానులం..సినిమా ఎలా ఉన్నా…ఎంకరేజ్ చేస్తాం అంటే మీ ఇష్టం..లేకుండా టచ్ చేయకుండా ఉండటమే బెస్ట్.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

tr> tr> tr>
ఇంటిలిజెంట్ FEB 9
గాయత్రి FEB 9
తొలిప్రేమ FEB 10
అ! FEB 16
ఆచారి అమెరికా యాత్ర FEB 16
మనసుకు నచ్చింది FEB 16
కిరాక్ పార్టీ FEB

Now Showing

tr> tr>
చలో FEB 2
టచ్ చేసి చూడు FEB 2
భాగమతి JAN 26
రంగుల రాట్నం JAN 14
జై సింహ JAN 12
గ్యాంగ్ JAN 12
అజ్ఞాతవాసి JAN 10