టాలీవుడ్ రివ్యూస్

‘అజ్ఞాతవాసి’ : అంచనాలు తారుమారు

agnathavasiవన్ కళ్యాణ్ కు ఖచ్చితంగా హిట్ కావాల్సిన సమయం ఇది. తనకు రెండు హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ తో అయితే అది ఖచ్చితంగా సాధ్యమేనని నమ్మి పిలిచారు. త్రివిక్రమ్ తలూపి ‘అజ్ఞాతవాసి’ ని అందించారు. అంతా బాగానే ఉంది…కానీ అర్జెంటుగా కథ వండేయటం వలనో ఏమో కానీ కాపీ వివాదం చుట్టుకుంది. లార్గో వించ్ ని లేపేసి ‘అజ్ఞాతవాసి’ కథ అల్లేసారంటూ మీడియా,సోషల్ మీడియా హోరెత్తిపోయింది. రీమేకో,ఫ్రీమేకో…ఏదో ఒకటి మేకుగా గుచ్చుకోకుండా హిట్ వస్తే చాలు అని అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆ క్షణాలు వచ్చేసాయి. ‘అజ్ఞాతవాసి’ వచ్చేసాడు. మరి పవన్ నమ్మకాన్ని, అభిమానుల అంచనాలని ఈ సినిమా రీచ్ అయ్యిందా… కాపీ మ్యాటర్ లో నిజం ఎంత…సినిమా స్టోరీ లైన్ ఏమిటి…వంటి విషయాలు కోసం రివ్యూ చదవండి .

కథేంటో చూద్దాం

agnathavasi poster3ఏబి గ్రూప్స్ అధినేత, ఇండస్ట్రలిస్ట్ విందా (బొమన్ ఇరాని) మొదట భార్య కొడుకు అభిషిక్త భార్గవ్ (పవన్) ..అస్సాంలో ‘అజ్ఞాతవాసి’లా పెరుగుతూంటాడు. అందుకు కారణం…బిజినెస్ లో ప్రత్యర్దులు తన కుమారుడుని టార్గెట్ చేసి వారసుడు లేకుండా చెయ్యకూడదని విందా ప్రాక్టికల్ గా ఆలోచించటమే. ఊహించినట్లుగానే విందా ఓ రోజు తన గుర్తు తెలియని శత్రువుల చేతిలో దారుణంగా చంపడతాడు. వారసుడు సీన్ లోకి రావాల్సిన సమయం అది. అయితే వారసుడు నేనే అంటూ వస్తే….తన తండ్రిని చంపిన శత్రువులు ఎలర్టైపోవచ్చు. వారు ఎవరో తెలిసే అవకాసం ఉండదు..తనకు ముప్పే. ఇదంతా తన సవితి తల్లి ఇంద్రాణి (కుష్భూ)తో ఆలోచించి…ఆ కంపెనీలో ఓ మేనేజర్ గా ప్రవేశిస్తాడు. వచ్చి తన తండ్రి చంపిన వాళ్లెవరో కూపీ లాగుతూంటాడు. ఆ క్రమంలో అనేక సంఘటనలు చోటు చేసుకుంటాయి. అవేమిటి..ఇంతకీ తన తండ్రిని చంపిన వాళ్లు ఎవరు…వాళ్లను ఎలా పట్టుకున్నాడు…ఈ కథలో హీరోయిన్స్ కు ఉన్న ప్రాధాన్యత ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది..(హైలెట్స్ ..మైనస్ లు)

ఖచ్చితంగా చెప్పాలంటే రచయితగా త్రివిక్రమ్ స్దాయికి తగినట్లు సినిమా లేదు..ఆయన శైలి సీన్స్ లో, డైలాగుల్లో పూర్తిగా మిస్సైంది. అయితే డైరక్టర్ గా మాత్రం చాలా బాగా డీల్ చేసారని చెప్పాలి. సినిమాలో విలన్ పాత్ర (ఆది పినిశెట్టి) కు ప్రాధాన్యత లేకపోవటంతో పవర్ స్టార్ లో ఉండే పవర్ ని ఎలివేట్ చేయలేకపోయింది. థ్రిల్లర్ ఎలిమెంట్స్ సాగే ఇలాంటి సినిమాల స్క్రిప్టుకు ఈ తరహా సమస్యలు వస్తాయి కానీ …వాటిని అధిగమించే ఎలిమెంట్స్ ని జత కూర్చటం జరగలేదు. కానీ ఇలాంటి కథను సైతం పవన్ కళ్యాణ్ తన స్టామినా తో ఒడ్డున పడేసేందుకు ప్రయత్నించటంతో వన్ మ్యాన్ షోలా మారింది.

‘అజ్ఞాతవాసి’ …ఆ కథనే లేపేసి

అలాగే ‘లార్గోవించ్’ చిత్రం కాపీ విషయానికి వస్తే…నిజమే అనిపిస్తుంది. సినిమా మెయిన్ స్టోరీ లైన్ ని అక్కడ నుంచే తీసుకున్నారని ఈజీగా అర్దమవుతుంది. అలాగే సినిమాలో కొన్ని సీన్స్, షాట్స్ సైతం లార్గో వించ్ నుంచి తీసుకున్నట్లు అర్దమవుతుంది. అయితే లార్గోవించ్ ని మన తెలుగు నేటివిటికి మార్చటంలో త్రివిక్రమ్ ఎప్పుడులా మ్యాజిక్ చెయ్యలేకపోయారు. లార్గోవించ్ స్టోరీని అయితే తీసుకున్నారు కానీ అందులో ఉండే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని, ఆ మూడ్ ని వదిలేసారు.

అలాగే ఈ సినిమాలో హీరోయిన్స్ కు అన్యాయం జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే వాళ్లు కేవలం అందచందాలు ప్రదర్శనకు, పాటలకు తప్ప కథలో ప్రయారిటీ లేదు. లవ్ agnathavasi4ట్రాక్ మొత్తం తేలిపోయింది. ఇక ఖుష్బూ పాత్ర..అత్తారింటికి దారేదిలో నదియా పాత్ర అంత డెప్త్ ఉన్నది కాదు. వెన్నెల కిషోర్, రఘుబాబు, మురళిశర్మ, రావు రమేష్ వీళ్లంతా కామెడీకు ఖర్చైపోయారు.

ఇక అనిరుధ్ పాటలు…బయిట విన్నంత గొప్పగా తెరమీద చిత్రీకరణ లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. అలాగే సినిమా లెంగ్త్ కాస్త ఎక్కువైన ఫీలింగ్ వచ్చింది. కెమెరా వర్క్ మాత్రం హై స్టాండర్డ్స్ లో ఉంది సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఎడిటింగ్ కూడా ఫెరఫెక్ట్ గా ఉంది. నిర్మాతలు డబ్బులు గుమ్మరించినట్లుగా తెరపై ప్రతీ ఫ్రేమ్ లోనూ కనపడుతుంది. కొడుకా ..కోటీశ్వరరావు పాట సినిమాలో ఇంకా బాగుంది.

ఆఖరి మాట

సినిమా పవన్ ఫ్యాన్స్ కు నచ్చినంతగా మిగతా వాళ్లకు ఎక్కకపోవచ్చు. అయితే సినిమా డీసెంట్ గా ఉంది కాబట్టి ఫ్యామిలీలు .. సంక్రాంతి సినిమాగా ‘అజ్ఞాతవాసి’ని ఎంచుకునే అవకాసం ఉంది.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16