టాలీవుడ్

పవన్ కళ్యాణ్ కు అంతర్జాతీయ అవార్డు ..!

pawanజనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం ఎక్సలెన్స్ అవార్డు (ఐఈబీఎఫ్)కు ఆయన్ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఈ సందర్భంగా ఓ ప్రకటనను పొందుపరిచింది. నవంబర్ 17న బ్రిటన్ లోని హౌస్ ఆఫ్ లార్డ్స్ జరగనున్న సమావేశంలో ఈ పురస్కారాన్ని పవన్ కల్యాణ్ అందుకుంటారని ఆ ప్రకటనలో తెలిపారు.

ఇటీవలే అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్శిటీ పవన్‌ కల్యాణ్‌ను గౌరవించగా.. ఇప్పుడు ప్రతిష్ఠాత్మక ఎక్స్‌లెన్స్‌ అవార్డు వరించింది. వివిధ రంగాల్లో సేవలందించిన వారికి ఏటా గ్లోబల్‌ బిజినెస్‌ మీట్‌ సందర్భంగా ఈ అవార్డుతో ఐఈబీఎఫ్‌ గౌరవిస్తోంది. ఈ సారి పవన్‌ కల్యాణ్‌ను అవార్డుతో సత్కరించాలని నిర్ణయించింది. నటుడిగా, రాజకీయ నాయకుడిగా కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న పవన్‌కు ఈ ఏడాది ఎక్స్‌లెన్స్‌ అవార్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఐఈబీఎఫ్‌ ఇండియా విభాగం అధిపతి సునీల్‌ గుప్తా, సమన్వయకర్త చంద్రశేఖర్‌ తెలిపారు. ఈ మేరకు పవన్‌ను కలిసి ఆహ్వానాన్ని అందించారు.

శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలోని వేలాదిమంది కిడ్నీ వ్యాధి పీడితులను ఆదుకోవడంలో పవన్‌ చూపిన మానవత్వం, చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నిలిచి నేత కళాకారులకు వెన్నుదన్నుగా నిలిచిన తీరు, సామాజిక సమస్యల పరిష్కారంలో ఆయన చూపుతున్న చొరవ, కృషి ఎన్నో హృదయాలను హత్తుకున్నట్లు వారు కొనియాడారు.

Comments

comments

Trending

Latest

Trailer

Coming Soon

స్పైడర్ SEP 27
మహానుభావుడు SEP 29
లండన్ బాబులు

Now Showing

జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18

Poll