టాలీవుడ్ రివ్యూస్

‘ఛలో’ కామెడీ ఫ్లోలో ….

తారాగణం: నాగ శౌర్య, రష్మిక మండన్న, అచ్యుత్ కుమార్, నరేష్, వైవా హర్ష, రఘు బాబు, ప్రగతి, ప్రవీణ్, సత్య, సుదర్శన్, రాజేంద్రన్ తదితరులు….
పాటలు – భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్, డ్యాన్స్రఘు, విజయ్
పి.ఆర్.ఓఏలూరు శ్రీను, పబ్లిసిటీ డిజైన్స్అనిల్ భాను
ఫైట్స్వెంకట్, ఆర్ట్రామ్ అరసవిల్లి, లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి
ఎడిటింగ్కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి), తమ్మిరాజు
సంగీతంమహతి స్వర సాగర్
సినిమాటోగ్ర‌ఫిసాయి శ్రీరామ్‌,
నిర్మాత‌ఉషా ముల్పూరి, సమర్పణశంక‌ర ప్ర‌సాద్ ముల్పూరి,
ద‌ర్శ‌క‌త్వంవెంకి కుడుముల‌
విడుదల తేదీ: ఫిబ్రవరి 2, 2018chalo

తొలి నుంచి నాగశౌర్య కెరీర్ నత్త నడక నడుస్తూనే ఉంది. క్లాస్ సినిమాలు చేస్తున్నా కాబట్టే ఈ సమస్య ఉందేమోనని జాదూగాడు వంటి మాస్ సినిమాలు ట్రై చేసినా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ మసి అవ్వటం తప్ప పెద్దగా ఒరిగిందేమీ లేదు. దాంతో కొంతకాలం గ్యాప్ ఇచ్చి…స్టోరీ లోనే విభిన్నత చూపెడదాం అని కొత్త దర్శకుడు తెచ్చిన కథని ఓకే చేసి ఛలో అన్నాడు. మరి చూసిన జనం కూడా నచ్చేసి పొలోమంటూ పదిమందికి చెప్పి హిట్ చేసారా లేక బోరో అంటూ ప్రక్కకు తప్పుకున్నాడా అనే విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి

హరి(నాగ శౌర్య)ది ఏదో ఒక గొడవలో తల దూర్చి తన్నటం లేదా తన్నించుకోవటం లో ఆనందం వెతుక్కునే క్యారక్టర్. దాంతో తన కొడుకు ఇలా గొడవలు పాలైపోతున్నాడని తల్లితండ్రులు బెంగ పెట్టేసుకుని…రోజూ గొడవలు జరిగే ప్రాంతంలో ఉంటే కనుక…గొడవలంటే విరక్తిపుడుతుందేమో అని ఆశపడతారు. అలా గొడవలు ఉండే ప్రాంతం వారికి ఆంధ్ర-తమిళనాడు బార్డర్‌లో దొరుకుతుంది. ఆ ఊరు పేరు తిరుప్పురం.

తిరుప్పురం జనాలకి వేరే ప్రత్యేకమైన పని ఉన్నట్లు ఉండదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక విషయంలో గొడవపడుతూంటారు. అందుకు కారణం …ఆ ఊళ్లో తెలుగు వాళ్లు, తమిళవాళ్లు ఇద్దరూ ఉండటమే. వారిద్దరూ రెండు వర్గాలుగా విడిపోయి కంచె నిర్మించుకుని మరీ కయ్యాలకు కాలు దువ్వుతూంటారు. ఈ వాతావరణం సహజంగానే హరికి పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది. పోన్లే ఊరులో గొడవలు ఎంజాయ్ చేద్దామనుకుంటూండగా… అక్కడ ఉండే కార్తిక (రష్మిక)కూడా తెగ నచ్చేసి ప్రేమలో పడిపోతాడు.

అయితే హరి ప్రేమ ఆ ఊరి గొడవలను మరింతగా పెంచేందిలా తయారువుతుంది. ఎందుకంటే హరి ప్రేమించింది మరెవరినో కాదు …తమిళ గొడవల గ్రూప్ కు చెందిన నాయకుడు కూతురుని…తెలుగువాళ్లంటే పడని వాళ్లని …మీ అమ్మాయని ప్రేమించాను ..పెళ్లి చేయండి అని ఎలా అడగగలడు…అసలు ఆ ఊరు అలా ఎప్పుడు గొడవలు పడే ఊరుగా మారటానికి కారణం ఏమిటి…చివరకు హరి ఏం నిర్ణయం తీసుకుని తన ప్రేమను గెలుచుకున్నాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్…

అల్లరి నరేష్ వంటి కామెడీ హీరో చేయదగ్గ కథలాంటిది నాగశౌర్య లాంటి డీసెంట్ హీరోకు ఎన్నుకోవటం ఆశ్చర్యం అనిపిస్తుంది. అయితే కామెడీలు జనాలు బాగానే చూస్తారు, రెండు ఊళ్లు భాషా పరంగా విడిపోవటం కొత్తగా ఉంది అనే ధైర్యంతో ఈ పాయింట్ వెరైటీగా అనిపించి సినిమా చేసి ఉండవచ్చు. అలాగే తమిళ మార్కెట్ సైతం కలిసి వస్తుందనుకోవచ్చు. అయితే ఇలాంటి కథలు బోలెడు తెలుగు సినిమా గతంలో చూసేసింది. భాషా పరంగా విడిపోవటం అనే విషయం తప్ప ఇందులో కొత్తేమీ లేదు. సినిమా మొత్తం ప్రెడిక్టుబుల్ గానే సాగుతుంది. ముఖ్యంగా ఫస్టాఫ్ లో ఫన్ బాగా పేలింది..సెకండాఫ్ సోసోగా ఉంది.

అయితే ఈ సినిమాలో చెప్పుకోదగ్గ హైలెట్ …సినిమాలో కామెడీ డోస్ బాగా ఎక్కువగా ఉండటమే. అదే ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. నాగశౌర్య కు ఇది విభిన్నమైన పాత్రే. హీరోయిన్ రష్మిక సైతం బాగానే ఎక్సప్రెసివ్ గా ఉంది. సత్య,వైవా హర్షలు సినిమాకు మెయిన్ పిల్లర్స్ గా నిలిచారు.

టెక్నికల్ గా చెప్పాలంటే ..సినిమాలో కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ సెకండాఫ్ లో మరింత స్పీడు చెయ్యాలనిపిస్తుంది. స్క్రిప్టు మరింత బాగా రాసుకుని ఉంటే ఇంకా బాగుండేది.

చివరి మాట

ఈ సినిమా కామెడీ కోసం చూడచ్చు…అంతకు మించి చెప్పుకోదగింది ఏమి లేదు. ఈ సినిమాతో పాటు రిలీజైన రవితేజ..టచ్ చేసి చూడు..రిజల్ట్ పై ఈ సినిమా ఏ స్దాయిలో వర్కవుట్ అవుతుందనేది ఆధారపడి ఉంటుంది.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

tr> tr> tr>
ఇంటిలిజెంట్ FEB 9
గాయత్రి FEB 9
తొలిప్రేమ FEB 10
అ! FEB 16
ఆచారి అమెరికా యాత్ర FEB 16
మనసుకు నచ్చింది FEB 16
కిరాక్ పార్టీ FEB

Now Showing

tr> tr>
చలో FEB 2
టచ్ చేసి చూడు FEB 2
భాగమతి JAN 26
రంగుల రాట్నం JAN 14
జై సింహ JAN 12
గ్యాంగ్ JAN 12
అజ్ఞాతవాసి JAN 10