బాలీవుడ్

పోలీసులకు లొంగిపోయిన భారీ చిత్రాల నిర్మాత

msid-56659294,width-400,resizemode-4,karim-moraniయువతిపై అత్యాచారం కేసులో .. బాలీవుడ్‌ నిర్మాత కరీం మొరానీ పోలీసులకు లొంగిపోయాడు. సుప్రీంకోర్టు బెయిల్‌ పిటిషన్‌ ను తిరస్కరించి.. రాష్ట్ర పోలీసులకు లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో మొరానీ హయత్‌నగర్‌ పోలీసులకు సరెండర్‌ అయ్యాడు. వైద్యపరీక్షల కోసం అతన్ని ఆసుపత్రికి తరలించారు. అటు మరికాసేపట్లో మొరానీని.. ఎల్బీనగర్‌ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. హైదరాబాద్‌ యువతికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసినట్టు మొరానీపై ఆరోపణలు ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే… సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని చెప్పి బీబీఎం విద్యార్థినిపై అత్యాచారం జరిపిన కేసులో బాలీవుడ్ చిత్ర నిర్మాత కరీం మొరానీ నిందితుడు. దీంతో ఆయన తెలంగాణ రాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆయన పేరు కరీం మొరానీ. ఈయన ‘రావన్’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘దిల్ వాలే’ వంటి హిట్ చిత్రాలను నిర్మించాడు.

ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే… సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పి 2015లో బీబీఎం విద్యార్థినిని ట్రాప్ చేశాడు. అదే ఏడాది జూలైలో ఆమెకు మత్తుమందిచ్చి రేప్ చేశాడు. ఆ సందర్భంగా తీసిన అభ్యంతరకర ఫోటోలను అడ్డం పెట్టుకుని ఆరు నెలలపాటు ముంబై, హైదరాబాదుల్లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

అంతేకాకుండా కరీం మొరానీకి అండర్ వరల్డ్ మాఫియాతో కూడా సంబంధాలు ఉన్నాయని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమెను చంపేస్తానని బెదిరింపులకు కూడా పాల్పడ్డట్టు తెలిపింది. దీంతో అతనిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, బెయిల్‌పై బయటకు వచ్చి, ఆమెపై బెదిరింపులకు దిగాడు. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు నిందితుడి బెయిల్‌ను రద్దు చేసింది, వెంటనే అతను కోర్టులో లొంగిపోవాలని సూచించింది. దీంతో ఆయన హైదరాబాదులోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

Comments

comments

Trending

Latest

Trailer

Coming Soon

స్పైడర్ SEP 27
మహానుభావుడు SEP 29
లండన్ బాబులు

Now Showing

జై లవ కుశ SEP 21
ARJUN REDDY AUG 25
ఆనందో బ్రహ్మ AUG 18

Poll