టాలీవుడ్ రివ్యూస్

రివ్యూ జై సింహా` : ఆ కాలం కథరా..

Pre-Release-Trailer--Balakrishna-S-Jai-Simha-41515428782-1433హిట్,ప్లాఫ్ లకు సంభంధం లేకుండా వరసపెట్టి సినిమాలు చేసే బాలయ్య… తన కోసం వచ్చే ప్రేక్షకులను అలరించటమే థ్యేయంగా పని చేస్తూంటారు. అందుకే బాలయ్య సినిమా కోసం ఓ వర్గం ప్రత్యేకంగా ఎదురుచూస్తూంటుంది. ఆ కోవలో వచ్చిందే `జై సింహా`. కమల్,రజనీ వంటి స్టార్స్ తో సినిమాలు చేసిన కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేసిన కావటం, ఈ చిత్రం బాలయ్య సెంటిమెంట్ …సంక్రాంతికి రావటంతో మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాలను అందుకునేలా ఈ సినిమా ఉందా…చిత్రం కథేంటి.. ఈ సంక్రాంతి హిట్ గా నిలుస్తుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి

సంవత్సరం వయస్సున్న కొడుకుతో నరసింహా(బాలకృష్ణ) రాష్ట్రాలు అన్ని తిరుగుతూ పని వెతుక్కుంటాడు. ఎక్కడా ఎక్కువ కాలం ఉండలేకపోతాడు. ఎందుకంటే పనిలో చేరినప్పుడు అక్కడ తన బిడ్డకు సరిపడే వాతావరణం లేకపోతే ఆ ప్రాంతాన్ని వెకేట్ చేసేస్తూంటాడు. అలా తిరుగుతూ..తిరుగుతూ చివ‌ర‌కు త‌మిళ‌నాడులోని కుంభ‌కోణం చేరుకుంటాడు. అక్క‌డ వెంక‌టేశ్వ‌ర స్వామి గుడి ప్రధాన ధ‌ర్మ‌క‌ర్త (ముర‌ళీమోహ‌న్‌) ప‌రిచ‌యం అవటంతో … ఆయ‌న ఇంట్లో కారు డ్రైవర్ పనికి చేరుతాడు.

అక్కడ కొడుకుతో కాలక్షేపం చేస్తూండగా.. ఆలయ ధర్మకర్త కుమార్తె ధాన్య(నటాషా దోషి) ఆ ఊళ్లో ఉన్న పెద్ద రౌడీ కనియప్పన్ తమ్ముడుని యాక్సిడెంట్‌ చేస్తుంది. అయితే తనకు పని ఇచ్చారనే కృతజ్ఞతతో ఆ నేరాన్ని నరసింహ తనపై వేసుకుంటాడు. ఇలా యాక్సిడెంట్ తనపై వేసుకోవటంతో కొన్ని కొత్త సమస్యలు ప్రారంభమవుతాయి. ఆ రౌడీ నా తమ్ముడుని చంపుతావా అని కత్తి పట్టుకుని వెంటబడతాడు.

దీనికి తోడు…కుంభకోణంలో ఆల‌య ఆర్చ‌కుల‌కు, పోలీసుల‌కు జ‌రిగిన గొడ‌వ‌ల్లో న‌ర‌సింహం చొర‌వ తీసుకుని, జిల్లా ఎస్.పితో అర్చ‌కుల‌కు క్ష‌మాప‌ణ చెప్పించటంతో అందరి దృష్టిలో పడతాడు. అయితే ఏసీపీని ఎదిరించడంతో అతనికి కూడా శత్రువుగా మారతాడు. దీంతో ఇక్కడకూడా ప్రశాంతంగా ఉండలేం అనుకుని ఆ చిన్నారిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలను బయలుదేరతాడు.

అదే సమయంలో అర్చకుల గొడవ టీవిలో వస్తుంది. అది చూసిన ఉరిశిక్ష ప‌డిన ఖైదీ(అశుతోష్ రాణా)..న‌ర‌సింహంను చంపాల‌ని జైల్లోనే ఆవేశపడతాడు. ఆ ఖైదీ మంచి అదునుకోసం వెయిట్ చేస్తున్నాడని అర్దమవుతుంది. ఇంతకీ ఆ ఉరిశిక్ష పడ్డ ఖైదీకు నరసింహాకు సంభందం ఏమిటి…అసలు ఇలా కొడుకుని ఎత్తుకుని ఊరూరా తిరగాల్సిన పరిస్దితి నరసింహాకు ఎలా వచ్చింది..అసలు నరసింహా ఎక్కడి వాడు…అతని ప్లాష్ బ్యాక్ ఏమిటి…ఆ ప్లాష్ బ్యాక్ లో నరనతార, హరిప్రియకు తో బాలయ్యకు ఉన్న రిలేషన్ ఏమిటి..వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది

కథగా చెప్పుకోవటానికి బోలెడు ఉందని పించినా..నిజానికి చాలా చిన్న స్టోరీ లైన్ ఇది. క్యారక్టర్స్ ఎక్కువ, కథ తక్కువ. ఈ కథని …బాలయ్య సూపర్ హిట్స్ అన్ని దగ్గర పెట్టుకుని అల్లినట్లు ఉంటుంది. అయితే ఇందులో కొత్త విషయం ఏమిటి అంటే…ఈ మధ్యకాలంలో బాలయ్యతో ఎవరూ లవ్ స్టోరీ చేయలేదు..ఆ ధైర్యం చేయటం లేదు. ఈ వయస్సులో లవ్ స్టోరీ ఏం బాగుంటుంది అనుకుంటున్నారో ఏమో కానీ ఎవరూ టచ్ చేయటం లేదు. కేవలం బాలయ్య ఎప్పుడూ కుర్రాడినే అని చెప్పే మాటలను పట్టుకుని ఆయనపై ఓ లవ్ స్టోరీ ప్లాన్ చేసినట్లు అనిపిస్తుంది. లేకపోతే…హీరోయిన్ వెనక పడుతూ..ఓ టీనేజ్ కుర్రాడిలా.. ఆమె తండ్రికి ఆ మాట చెప్పటానికి భయపడే..నరసింహ గా కనిపిస్తాడు. ఆ సీన్స్ బాగా ఓవర్ అనిపిస్తాయి.

సాంకేతికంగా…

ఇక ఈ సినిమా టేకింగ్, మేకింగ్ ఓ ఇరవై సంవత్సరాల వెనక్కి వెళ్లినట్లు అనిపిస్తుంది. కెమెరా వర్క్ అలాగే ఉంది. దర్శకుడుగా కె ఎస్ రవికుమార్ ఈ కాలం సినిమాలను పట్టించుకుంటున్నట్లు లేరు. చూస్తున్నట్లు లేరు. ఎంత అడ్వాన్సెడ్ గా సినిమాలు వస్తున్నాయనేది. సెంటిమెంట్ పండించవచ్చు కానీ …మరీ టీవి సీరియల్ లాగ తీయకూడదు కదా..ఫస్టాఫ్ స్పీడుగా నడిచిపోయినా సెకండాఫ్ స్లో అయిపోయిన ఫీలింగ్ వచ్చింది.

కామెడీ కలిసి రాలేదు

ఇక బ్రహ్మానందం ఈ మధ్యకాలంలో ఏ సినిమాలోనూ కనిపించటం లేదు. ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేసారు. అయితే ఆయన కామెడీ కూడా బాగా అరిగిపోయిందే. చంద్రముఖిలో వడివేలు ట్రాక్ ని యాజటీజ్ లేపేసారు. అది మనకు ఇంకా గుర్తుందనే విషయం మర్చిపోయారు.

చివరి మాట

బి,సి సెంటర్లను టార్గెట్ చేసినట్లు ఉన్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు పడితే …ఫలితం మెరుగుగా ఉంటుంది.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16