టాలీవుడ్ రివ్యూస్

‘హలో’ : సిగ్నల్స్ వీక్

hello posterఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలతో భారీ ఎత్తున అఖిల్ ని లాంచ్ చేస్తే తొలి సినిమానే తుస్సు మంది. సినిమా పోతే పోయింది. అందరూ ఇదేం సినిమా అంటూ విమర్శలు చేసారు. సరైన కథే దొరకలేదా..లాంచింగ్ అని వెటకారాలు చేసారు. దాంతో ఇది కాదు పద్దతి అని అక్కినేని కుటుంబ కథా చిత్రం లాంటి మనం ని తీసిన దర్శకుడుని పిలిచి ప్రాజెక్టు చేతిలో పెట్టారు. అప్పుడాయిన..ఈ కుర్రాడు దేనికి పనికివస్తాడు. ఆల్రెడీ ప్లాఫ్ కొట్టి ఉన్నాడు. ఏ మాత్రం అజాగ్రత్త జరిగినా ఆ తర్వాత భాక్సాఫీస్ ఆనవాళ్లు దొరకని పరిస్దితి వస్తుంది అని అర్దం చేసుకుని హలో అంటూ ఓ లవ్ స్టోరీని వండి వడ్డించాడు. నాగ్ సైతం తన కుమారుడుకి హిట్ ఇచ్చి వారసత్వం నిలబెట్టాలని పనులున్నీ కట్టిపెట్టి…ఈ సినిమా మీదే మనసు పెట్టాడు. అయితే ఇది మనసంతానువ్వే లాంటి కథ అని ఆల్రెడీ టీజర్ తో జనం నిర్దారించారు. ఆ టాక్ లో నిజం ఎంతుంది..అసలు ఈ సినిమా కథేంటి..దర్శకుడుపై నాగ్ పెట్టుకున్న అంచనాలు ఎంతవరకూ నిజమయ్యాయి అనే విషయాలు రివ్యూలో చూద్దాం.

కథ

అనాథైన శీను (అఖిల్) కి చైల్డ్ హుడ్ ఫ్రెండ్ జున్ను (కళ్యాణి ప్రియదర్శిన్) ఎంతో అభిమానం..ప్రేమ. జున్నుది కూడా సేమ్ టు సేమ్ అదే పరిస్దితి. ఇద్దరూ రోజూ కలవటం,కబుర్లు చెప్పుకోవటం వంటివి చూస్తూంటారు. అయితే ఈ లోగా జున్ను తండ్రికి డిల్లీ ట్రాన్సఫర్ రావటంతో వీరి స్నేహానికి విఘాతం ఏర్పడుతుంది. కానీ ఆమె వెళ్లేటప్పుడు తన ఫోన్ నెంబర్ ఇచ్చి మరీ వెళ్తుంది. కానీ అనుకోకుండా ఆ నెంబర్ మిస్సవుతుంది. అదిగో అక్కడ నుంచి శీను తిప్పలు మొదలవుతాయి. ఆమె కోసం అవి పెరిగి పెద్దైనా కొనసాగుతాయి. ఆమెపై అభిమానాన్ని ప్రేమగా పెంచుకుని వెతుకుతూంటాడు. ఆమె కూడా తక్కువ తినలేదు. ఆమె కూడా అదే పనిలో ఉంటుంది. మధ్యలో వీరు కలవకుండా రకరకాల అవాంతరాలు వస్తాయి. అవేమిటి…చివరకు వాళ్లు కలిసారా..అనేది మిగతా సినిమా

ఎలా ఉంది

విక్రమ్ కుమార్ నుంచి ఎక్సపెక్టే చేసే స్దాయిలో మాత్రం ఈ సినిమా లేదు. మనసంతా నువ్వే సినిమాకు యాక్షన్ ఎపిసోడ్స్ కలిపినట్లుంది. అయితే మనసంతా నువ్వే లో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి. ఇక్కడ అవి మిస్సయ్యాయి. అలాగే …ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగా సాగతీసి దాదాపు నలభై నిముషాలు పాటు ఫస్టాఫ్ లో వచ్చింది. మనం అఖిల్ ని ..అతని ప్రేమ కథను చూడ్డానికి వెళితే ఈ చిన్న పిల్లలు ఎపిసోడ్ ఎందుకంత పెట్టారో అర్దంకాదు. ఇక విలన్ అజయ్ తో నడిచే మొబైల్ మాఫియా ఎపిసోడ్ సైతం సినిమాకు ఏ మాత్రం కలవని సీక్వెన్స్ లే.

టెక్నికల్ గా

హీరో,హీరోయిన్స్ లవ్ ఎపిసోడ్ చూపెట్టి వాళ్లు విడిపోయారు…వాళ్లు ఎప్పుడు కలుస్తారు వంటి ఎమోషన్ ని వర్కవుట్ చేయలేదు. దాంతో సినిమాలో హీరో,హీరోయిన్స్ కలిసేందుకు పడే కష్టం..చూసే వాల్లకు కష్టంగా అనిపిస్తుంది. ఆ విషయంలో దర్శకుడు విక్రమ్ కుమార్ విఫలమయ్యేరనే చెప్పాలి.

హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్ బాబ్ బ్రౌన్ రూపొందించిన యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. అనూప్ రూబెన్స్ పాటలు సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్కవుట్ అయ్యాయి. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగానే ఉంది. పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ అని చెప్పాలి. నిర్మాతగా నాగార్జునగారు తన కుమారుడు పైన బాగానే ఖర్చు పెట్టి సినిమాని గొప్ప స్థాయిలో నిలబెట్టారు.

చివరి మాట

అర్బన్ ఆడియన్స్ కు నచ్చినట్లుగా ఈ సినిమా బి,సి సెంటర్ల వారికి రీచ్ అవటం కష్టమే. ఖాళీ ఉంటే కాలక్షేపానికి ఓ సారి చూడవచ్చు. మనసంతా నువ్వేని మళ్లీ ఏం చూస్తాంలే అనుకుంటే…డబ్బులు మిగుల్చుకోవచ్చు.

Comments

comments

Teaser

Latest

Song

Coming Soon

నా పేరు సూర్య MAY 4
కాలా

Now Showing

భరత్ అనే నేను APR 20
కృష్ణార్జున యుద్ధం APR 12
ఛల్ మోహన్ రంగ APR 5
రంగస్థలం MAR 30
నీదీ నాదీ ఒకే కథ MAR 23
MLA MAR 23
కిరాక్ పార్టీ MAR 16