టాలీవుడ్

రానా వాయిస్ ఎవరికి ఇస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ranaహీరోలు తెరపై కనిపించడమొకటే కాదు… ఇతర చిత్రాల్లో తమ వాయిస్ ని వినిపిస్తూ కూడా సినిమాల్ని రక్తికట్టిస్తుంటారు. అందుకే స్టార్స్ వాయిస్‌ ఓవర్లకి చిత్రసీమలో భలే డిమాండ్‌. దాంతో వరసపెట్టి హీరోలు వాయిస్ ఓవర్లు ఇస్తున్నారు. ఇప్పుడు దగ్గుపాటి రానా వంతొచ్చింది. ఆయన కన్నడ చిత్రం ‘రాజరథం’ సినిమాలో బస్సుకి వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నారు. అంటే ఆ సినిమాలో బస్సు రానాలా మాట్లాడుతుందన్నమాట. అనూప్‌ భండారి దర్శకత్వంలో నిరూప్‌ భండారి, అవంతిక శెట్టి నాయకానాయికలుగా తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘రాజరథం’.

‘బాహుబలి’లో ‘భళ్లాలదేవుని’గా మెప్పించిన రానా పార్టిసిపేషన్‌ తో ఈ సినిమాకు ప్రత్యేకత వచ్చింది. ఆకట్టుకునే ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌తో ‘రాజరథం’పై ఇప్పటికే మంచి అంచనాలున్నాయి. ఇప్పుడు రానా కూడా ఈ టీమ్‌తో కలవడం వల్ల సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. రొమాంటిక్‌ కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రంతో హీరో, హీరోయిన్లుగా నిరూప్‌ భండారి, అవంతిక షెట్టి తెలుగు తెరకు పరిచయం అవనున్నారు.

దర్శకుడు అనూప్‌ భండారి ఈ చిత్రానికి కథ, పాటలు, సంగీతం అందించటం తో పాటు కొన్ని పాటలు కూడా పాడటం విశేషం. నిరూప్‌ భండారి హీరోగా అనూప్‌ భండారి దర్శకత్వం వహించిన ‘రంగి తరంగ’ చిత్రాన్ని యు.ఎస్‌, యూరప్‌ దేశాలలో పంపిణీ చేసిన ‘జాలీ హిట్స్‌’ సంస్థ తమ తొలి ప్రయత్నంగా ‘రాజారథం’ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతోంది. నిర్మాత అజయ్‌రెడ్డి ఉత్తమ ప్రమాణాలతో కూడిన చిత్రాన్ని ప్రేక్షకులకి అందించాలనే తపనతో టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ వరకు ఉన్న అత్యున్నత సాంకేతిక నిపుణులతో ఈ ‘రాజారథం’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తెలుగులో రానా, కన్నడలో ఓ స్టార్ హీరో వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నారు. ‘‘ఉన్నత ప్రమాణాలతో రూపొందుతున్న చిత్రమిది. పలువురు ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు నిర్మాత.

Comments

comments

Trailer

Latest

Song

Coming Soon

రంగస్థలం MAR 30
భరత్ అనే నేను APR 20
కాలా APR 27
నా పేరు సూర్య MAY 4

Now Showing

కిరాక్ పార్టీ MAR 16
ఏ మంత్రం వేసావె MAR 9
మనసుకు నచ్చింది FEB 16
అ! FEB 16
తొలిప్రేమ FEB 10
చలో FEB 2