టాలీవుడ్

టిక్కెట్ కోసం బ్లేడ్ తో కోసుకుని…

khidi-bladeమెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నెం.150 సినిమా భారీ అంచనాల నడుమ ఇవాళ విడుదలైంది. దాదాపు తొమిదిన్నర సంవత్సరాల తర్వాత తమ మెగాస్టార్ రీఎంట్రీ ఇస్తూ కనిపించడంతో అంతటా పండగ వాతావరణం కనపడుతోంది. హిట్ టాక్ రావటంతో…థియేటర్ల వద్ద సందడి నెలకొంది. ఫ్యాన్స్ కేకలు, అరుపులతో థియేటర్ ప్రాంగణాలు హోరెత్తిపోతున్నాయి. కత్తి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రంలో బాస్ ఈజ్ బ్యాక్ అన్న పదాన్ని చిరు నిజం చేస్తూ కుమ్మేసారు. దాదాపు 4500 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇంత సందడి నెలకొన్న విశాఖ జిల్లా.. రామాటాకీస్ వద్ద ఓ యువకుడు చేసిన పనితో అంతా నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. కలకలం రేగింది. మద్యం మత్తులో బ్లేడ్‌తో ఒంటిపై గాయపరచుకుని ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. చిరు సినిమా టిక్కెట్ కావాలంటూ నానా రచ్చ చేశాడు. దీంతో థియేటర్ యాజమాన్యంలో ఆందోళన మొదలైంది. వెంటనే అతన్ని వైద్యం నిమిత్తం తరలించాలని ప్రయత్నించారు. అయినా అతను మూర్ఖంగా వ్యవహరిస్తూ సినిమా టికెట్ ఇవ్వకపోతే చచ్చిపోతానంటూ అందరినీ హడలెత్తించాడు. పోలీసులు రావడంతో పరిస్థితి సద్దుమణిగింది.

సినిమాలో చిరంజీవి చెప్పే….గ‌ల్లి నుండి ఢిల్లీ పాలిటిక్స్ వ‌ర‌కు త‌ట్టుకున్న గుండెరా ఇది…, సముద్రం ఒడ్డున నిల‌బ‌డి, స‌ముద్రం వెన‌క్కి వెళ్లింది క‌దా అని న‌వ్వితే, అదే స‌ముద్రం సునామీతో ముంచేస్తుంది..అభిమానాన్ని అమ్ముకునేంత అవినీతిప‌రుడుని కాను అనే డైలాగ్స్, న‌వ్వుకునే వాడు ఓరోజు ఏడ్చే రోజు వ‌స్తుంది. వంటి డైలాగ్స్ మాస్ ఆడియెన్స్‌ను, మెగాభిమానుల‌ను అల‌రిస్తాయి.

Comments

comments

Teaser

Trailer

song

Coming Soon

లండన్ బాబులు 17

Now Showing

ఒక్కడు మిగిలాడు NOV 10
C/O సూర్య NOV 10
నెక్స్ట్ నువ్వే NOV 03
PSV గరుడ వేగ NOV 03

Poll