టాలీవుడ్

‘ఖైదీ’ థియేటర్‌ పై ఫ్యాన్స్ దాడి

khidi-fansచిరంజీవి తాజా చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’ బుధవారం విడుదలైంది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ సినిమా అభిమానులను అలరిస్తోంది. తొమ్మిదేళ్ల తర్వాత మెగాస్టార్ చేసిన సినిమా కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. తమ అంచనాలకు తగినట్టుగానే సినిమా ఉందని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు పోస్టు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో కొన్ని సంఘటనలు మాత్రం బాధ కలిగించేలా జరిగాయి.

ముఖ్యంగా గుంటూరులో ..మెగా ఫ్యాన్స్‌ అభిమానం హద్దు మీరింది. తమ అభిమాన హీరో సినిమా ప్రదర్శన ఆలస్యం కావడంతో ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ థియేటర్‌ పై దాడికి దిగారు. ఈ ఘటన గుంటూరు జిల్లా కొల్లూరులో చోటుచేసుకుంది. వీవీ వినాయక్‌ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్‌ 150 చిత్రం బెనిఫిట్‌ షో వేస్తామని శ్రీనివాస థియేటర్‌ యాజమాన్యం తెలిపింది.

అయితే బుధవారం తెల్లవారుజాము వరకూ బెనిఫిట్‌ షో వేయకపోవడంతో అభిమానులు రెచ్చిపోయారు. థియేటర్‌ లోని కుర్చీలతో పాటు స్క్రీన్‌ ను ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీఛార్జ్‌ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రీమియర్ షో గ్రాస్ కలెక్షన్లలో ‘బాహుబలి’ ని అధిగమించే దిశగా ‘ఖైదీ’ పయనిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. చిరంజీవి 150వ చిత్రం రూ.100 కోట్లు మించి వసూళ్ల సాధిస్తుందని అభిమానులు దీమా వ్యక్తం చేస్తున్నారు.

Cartoon

latest

Trending

song

Coming Soon

అంధగాడు JUN 2
ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్ JUN 2
అమీ తుమీ JUN 8
ఆరడుగుల బుల్లెట్ JUN 9
Dj దువ్వాడ జగన్నాథమ్ JUN 23

Now Showing

రారండోయ్ వేడుకచూద్దాం MAY 26
కేశవ MAY 19
రాధా MAY 12
బాహుబలి 2 APR 28

Poll