టాలీవుడ్

హాలీవుడ్ స్దాయిలో ఉందీ ట్రైలర్

యంగ్ హీరో రానా హీరోగా తెరకెక్కుతున్న బహుభాషా చిత్రం ఘాజీ. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఘాజీ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు మంచి స్పందన రాగా.. తాజాగా చిత్రయూనిట్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. సినిమా నేపథ్యంతో పాటు సముద్ర గర్భంలో నావీ టీం చేసే అద్భుత విన్యాసాలను ట్రైలర్ లో చూపించారు. తెలుగుతో పాటు ఘాజీ హిందీ, తమిళ టీజర్లను కూడా ఒకేసారి రిలీజ్ చేశారు.

ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్, పి.వి.పి సినిమా సంయుక్తంగా నిర్మించాయి. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. 1971లో భారత్ -పాక్ మధ్య జరిగిన యుద్ధ సమయంలో నీట మునిగిన సబ్ మెరైన్ నేపథ్యంలో ఘాజీ చిత్రాన్ని తెరకెక్కించాడు.

సబ్ మేరిన్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న తొలి ఇండియాన్ మూవీ ఘాజీ కావడం విశేషం. ఈ మూవీని హాలీవుడ్ రేంజ్ లో రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు చూడని విధంగా హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు.

వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 17న రిలీజ్ చేయనున్నారు. మాట్నీ ఎంటర్టెయిన్మెంట్, పీవీపీ సినిమాలు కలిసి ఘాజీ చిత్రాన్ని నిర్మించాయి.

Cartoon

latest

Trending

song

Coming Soon

అంధగాడు JUN 2
ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్ JUN 2
అమీ తుమీ JUN 8
ఆరడుగుల బుల్లెట్ JUN 9
Dj దువ్వాడ జగన్నాథమ్ JUN 23

Now Showing

రారండోయ్ వేడుకచూద్దాం MAY 26
కేశవ MAY 19
రాధా MAY 12
బాహుబలి 2 APR 28

Poll